‘శ్రీకృష్ణ’ కాంగ్రెస్ బ్రోకర్ : నాగం
posted on Mar 26, 2011 @ 10:05AM
హైదరాబాద్: ఎనిమిదో చాప్టర్‌లో తెలంగాణ ప్రజలను కించపరిచేట్లు వ్యవహరించారంటూ జస్టిస్ శ్రీకృష్ణపై టీడీపీ తెలంగాణ ఫోరం నేత నాగం జనార్దన్‌రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. రాజకీయ నాయకుల్ని ‘మేనేజ్’ చేసుకుంటే సరిపోతుందని ఆయన పేర్కొన్న అంశాన్ని ఉటంకిస్తూ కాంగ్రెస్‌కు బ్రోకర్‌లా శ్రీకృష్ణ పనిచేస్తున్నాడని దుయ్యబట్టారు. అమ్ముడుపోయేందుకు తాము అంగడి సరుకు కాదని, ఆ సలహా ఇచ్చేందుకు వాడెవడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో చాప్టర్‌పై చర్చించేందుకు తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నేతల భేటీ టీడీఎల్పీలో జరిగింది. ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, ఎల్.రమణ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం వారితో కలిసి అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద నాగం మీడియాతో మాట్లాడారు. అవాస్తవాలమయం, తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న ఎనిమిదో చాప్టర్‌ను బహిర్గతం చేయాలన్న హైకోర్టు తీర్పును సీమాంధ్రులు జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. ‘మమ్మల్ని కొనుగోలు చేయాలని చెప్పేందుకు శ్రీకృష్ణ ఎవడు? కాంగ్రెస్‌కు చేస్తున్న బ్రోకర్ పనుల్లో భాగమే ఇలాంటి సలహాలు. ప్రజల చేతుల్లో ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని నాయకులే అనుసరించాలి తప్ప ఎవరినో కొనుగోలు చేస్తే అది సమసిపోదు’’ అని అన్నారు. ప్రకటనలు ఆపేసి పత్రికలను లొంగ తీసుకోవాలన్న శ్రీకృష్ణ సూచన పత్రికా స్వేచ ్ఛను హరించడమేనని తెలిపారు. ఎనిమిదో చాప్టర్‌ను బహిర్గతం చేసిన హైకోర్టు జడ్జి పనిని స్వాగతిస్తున్నామన్నారు.