శ్రీకాకుళం జిల్లాలో విషాదం
posted on Sep 19, 2015 @ 7:13PM
శ్రీకాకుళం జిల్లా భావనపాడు బీచ్ లో విషాదం చోటు చేసుకుంది, విహార యాత్రకు వెళ్లిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులు... సముద్రంలో గల్లంతయ్యారు. భావనపాడు బీచ్ లో సముద్ర స్నానం చేస్తుండగా అలల తాకిడి అధికమై కొట్టుకుపోయారు. గల్లంతైన విద్యార్ధులను ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీకి చెందినవారిగా గుర్తించారు. అయితే విద్యార్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని, మూడు నిండు ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయని అక్కడున్నవారంటున్నారు. బీచ్ ల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టి, బారికేడ్లు ఏర్పాటు చేస్తే ఇలాంటి ఘటనలను అరికట్టవచ్చని ప్రజలు సూచిస్తున్నారు