సీనియర్ ఎన్టీఆర్ ను వదలని జగన్ పార్టీ
posted on Apr 4, 2013 @ 12:31PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జూనియర్ ఎన్టీఆర్, దివంగత ఎన్టీఆర్ ను తమ పార్టీ కోసం తెగవాడేసుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో వైఎస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సంధర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఫ్లెక్సీ పెట్టడం పెద్ద దుమారం రేపింది. దీంతో ఆ తరువాత దానిని తొలగించారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ ఎన్టీఆర్ ఫోటోను పెట్టి షర్మిల పాదయాత్రకు స్వాగతం పలికేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పెట్టి నాలుగురోజులు గడవక ముందే సీనియర్ ఎన్టీఆర్ ను కూడా వాడేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి సామాన్యులకు పనికివచ్చిన పథకాలు రెండే రెండు అవి ఒకటి ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలోబియ్యం, రెండోది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం అని ప్రకటించుకున్నారు. అసలు ఈ పార్టీకి, ఎన్టీఆర్ వున్న లింకేంటో తెలియక జనాలు తలలు పట్టుకుంటున్నారు.