చిరంజీవి పై బాబు వ్యాఖ్యలు సరికాదు

 

 

 

 

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను ఒప్పుకోకుండా ఇతరులను విమర్శించడం తగదని మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవని అన్నారు. చిరంజీవి కి రాజకీయాలు తెలీదు కాని చిత్తశుద్ధి ఉందన్నారు. విద్యుత్ సమస్యలపై తనకు అవగాహన లేదనడం సబబుకాదన్నారు. ఓట్ల కోసం మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టారని మంత్రి విమర్శించారు. తాను చేసిన తప్పులకు క్షమాపణ చెప్పకుండా ఎన్ని కోలోమిటర్ల పాదయాత్ర చేసిన చంద్రబాబు ను ప్రజలు క్షమించరన్నారు.

Teluguone gnews banner