స్పీడ్ న్యూస్ 3
posted on Jul 18, 2023 @ 4:21PM
31. తమ సమస్యల పరిష్కారం కోసం గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులు ఈ రోజు మంత్రి మల్లారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
..........................................................................................................................................................
32. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో ప్రవాహం పెరుగుతోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు 14వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా, నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 813 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది.
.........................................................................................................................................................
33. టెట్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిమాండ్ తో టీఆర్టీ అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీసును ముట్టడించారు. టెట్ డీఎస్సీ ఎన్నికల కోడ్‌కు ముందే నోటిఫికేషన్‌లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.
........................................................................................................................................................
34. వాలంటీర్లతో ఓటర్ వెరిఫికేషన్ చేయించాలని సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చిన రాజప్ప అన్నారు. ఈ రోజు విలేకరులతో మాట్లాడిన ఆయన ఎల్‌ఏలు చేయాల్సిన పని వాలంటీర్లకు అప్పగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
.....................................................................................................................................................
35. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో అధికార వైసీపీ నేతల పంచాయితీ తాడేపల్లికి చేరింది. మంత్రి చెల్లుబోయిన వేణు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో మంత్రి వేణుపై సుభాస్ చంద్రబోస్ సజ్జలకు ఫిర్యాదు చేశారు.
............................................................................................................................................
36. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే కాంగ్రెస్ ధ్యేయమని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. భావసారూప్యత కలిగిన 26 పార్టీలకు చెందిన నాయకులం భేటీ అందుకేనన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం విభేదాలను విస్మరించి పని చేస్తామన్నారు.
...............................................................................................................................................
37. కోకాపేటలో బీఆర్ఎస్ కు 11 ఎకరాల భూ కేటాయింపుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, భారాసకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 16కి వాయిదా వేసింది.
...............................................................................................................................................
39. రానున్న నాలుగు రోజులలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నగర మేయర్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం సిబ్బందితో పరిస్థితిని సమీక్షించారు.
......................................................................................................................................
40. ములుగు జిల్లా లోని బొగత జలపాతం జలకళను సంతరించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు జలపాతంలోకి వరద నీరు వచ్చి చేరడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు బొగత జలపాతాన్ని చూసేందుకు పోటెత్తుతున్నారు.
..........................................................................................................................................................
41. మద్దిరాలలో ఓ రైతు విద్యుత్ షాక్ తో మరణించారు. నెల్లుట్ల సోమయ్య అనే రైతు రోజూలాగే వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి వ్యవసాయ మోటార్ వద్ద ఆన్ చేసే సమయంలో కరెంట్ షాక్ కొట్టి మరణించాడు.
....................................................................................................................................................
42. ఉదయ్ పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది సేపటికే ఎక్కడ టేకాఫ్ అయ్యిందో అక్కడే ల్యాండ్ అయ్యింది. దీనికి కారణం విమానంలో చార్జింగ్ పెట్టిన ఓ సెల్ ఫోన్ హీటెక్కి పొగలు కక్కడమే. దీంతో పైలట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు.
...........................................................................................................................................
43. బెంగళూరు వేదికగా జరుగుతున్న బీజేపీయేతర పార్టీల భేటీని బీజేపీ సీనియర్ నాయకుడు బసనగౌడ పాటిల్ యత్నాళ్ దోపిడీ దొంగల భేటీగా అభివర్ణించారు. ఆ భేటీలో పాల్గొంటున్న వారొలో అత్యధికులు అవినీతి ఆరోపణలపై బెయిలు మీద ఉన్నవారేనని పేర్కొన్నారు.
...........................................................................................................................................
44. తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ మరోసారి బయటపెట్టిందని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. సోమవారం హైదరాబాద్ రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచన చేస్తోందని విమర్శించారు.
................................................................................................................................................
45. రాహుల్ గాంధీకి ఎడ్లు, ఎవుసం తెలియదన్న కే టీఆర్ వాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండి పడ్డారు. విద్యుత్ పై బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతోందని, రాష్ట్రంలో ఆరు నెలలుగా వ్యవసాయానికి ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
............................................................................................................................................
46. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 21న నెల్లూరు జిల్లా వెంకటగిరి పర్యటనకు రానున్న నేపథ్యంలో త్రిభువని సెంటర్లో రోడ్ల పక్కన ఉన్న దుకాణాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. తమ దుకాణాలును తొలగించడం పట్ల దుకాణా దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
47. ఏపీలో జగన్ సర్కార్ ను గద్దె దించడమే తన ప్రధాన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. ఎన్డీయే పక్షాల సమావేశానికి హాజరైన ఆయన తాజా రాజకీయాలు, రానున్న ఎన్నికల్లో పొత్తు, సీఎం అభ్యర్థి.. వంటి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
.................................................................................................................................................
48. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని నిరూపిస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన దీనిపై చర్చకు చింతమడక, సిద్ధిపేట, సిరిసిల్ల ఎక్కడకు రమ్మన్నా వస్తానన్నారు.
...............................................................................................................................................................
49. తెలంగాణ హైకోర్టులో ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఊరట లభించింది. ఆయనకు చెందిన ఎస్ఆర్ గార్డెన్ భూముల్లో ప్రభుత్వం సర్వే చేయించడంపై పొంగులేటి హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టేటస్ కో ఆర్డర్ జారీచేసింది. విచారణను అగస్ట్ 1కి వాయిదా వేసింది.
...............................................................................................................................................
50. కాబోయే ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆరే అంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో వెలిసిన ఫ్లెక్సీల వెనుక ఉన్నది వైసీపీ నేతలేనని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగడాన్ని ఓర్చుకోలేకే ఈ ఫ్లెక్సీలు పెట్టారన్నారు.