తగ్గుముఖం పట్టిన నైరుతీ ఋతు పవనాలు,సకాలంలో ప్రవేశించిన ఈశాన్య ఋతు పవనాలు......
posted on Oct 17, 2019 @ 2:57PM
నిన్న మొన్నటి దాకా భారీ వర్షాలతో రాష్ట్రాలంతా అతలాకుతలమైపోయాయి అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. వాగులు,వంకలు నిండి వరదల్లతో ఎకంగా ఊర్ల సైతం నీట మునిగాయి.ఈ ఏడాది వర్షాలు బాగా కురిసాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నైరుతి ఋతు పవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి అనే తెలుకోవచ్చు. అదే సమయంలో తమిళనాడుకి ఆనుకుని ఉన్న ఆంధ్రా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈశాన్య ఋతు పవనాలు ప్రవేశించాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈశాన్య రుతుపవనాల రాకతో ఇప్పటికే ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, కేరళలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. నిన్న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఒక్క రోజులోనే డెబ్బై పాయింట్ తొమ్మిది సగటు వర్షపాతం నమోదైంది. దక్షిణ తమిళనాడును ఆనుకుని నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు కురవ వచ్చని, దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారీ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల ప్రభావం రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది.
అయినప్పటికీ ఆశించిన ఫలితాన్ని ఇచ్చింది. భారీగా వర్షాలు కురిశాయి. గతానికి భిన్నంగా ఈ ఏడాది చాలా ఆలస్యంగా నైరుతి ఉపసంహరణ జరిగింది. మరోవైపు ఈశాన్య ఋతు పవనాలు ఏడాది సకాలంలో విస్తరించనున్నాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఈశాన్య ఋతు పవనాలు అక్టోబర్ ఇరవై ఏడు లోపు ప్రవేశించనే లేదు.