భారతరత్నకి తక్కువయితే కుదర్దు మరి
posted on Apr 5, 2013 @ 8:18PM
తన మృదుమదురమయిన గళంతో పాటలకు ప్రాణం పోసే పాటల కోయిల శ్రీమతి యస్. జానకికి కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకమయిన పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది. అయితే గత 55ఏళ్లుగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర సీమలకు సేవచేస్తూ దాదాపు 20౦౦౦ పాటలు పైగా పాడిన తనకు ఈ అవార్డు ఎప్పుడో ఇచ్చి ఉండవలసిందని కానీ, దానిని ఇచ్చేందుకు కూడా ఇన్ని ఏళ్ళు ఆలోచించడం తనకి చాలా బాధ కలిగించిందని, ఇన్నేళ్ళుగా తానూ చేస్తున్న సేవలకి భారతరత్న ఇచ్చి ఉండి ఉంటే తనకు గౌరవంగా ఉండేదని, అందువల్ల తానూ ఈ అవార్డును స్వీకరించలేనని ఆమె తెలిపారు. ఈ వయసులో కూడా ప్రజలు మరియు చిత్ర సీమ, తనపై కురిపిస్తున్న అపార ప్రేమాభిమానాలే ఈ అవార్డుల కంటే తనకు ఎక్కువ ఆనందం కలిగిస్తాయని ఆమె అన్నారు.
ఈ రోజు రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రముఖ నటి శ్రీదేవి, ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు, దర్శకుడు బాపు, క్రికెటర్ రాహుల్ డ్రావిడ్, చేనేత కళాకారుడు గజం అంజయ్యలకు పద్మ అవార్డులు అందుకొన్నారు.