సింగరేణి 131 వ వార్షికోత్సవం... లాభాల్లో కార్మికులకు సైతం వాటా పంచుతూ రికార్డ్
posted on Dec 24, 2019 @ 10:41AM
బొగ్గు వెలికితీతలో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో దూసుకుపోతోంది సింగరేణి సంస్థ. ఒకప్పుడు తట్ట చెమ్మస్ తో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఉత్పత్తిలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. బొగ్గు ఉత్పత్తి మొదలైన 1889 లో ఏటా 59,671 టన్నుల బొగ్గు తవ్విన కంపెనీ ప్రస్తుతం 20 మంది అండర్ గ్రౌండ్ మైన్స్, 18 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల పరిధిలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో దూసుకుపోతోంది. 2013 లో 50 మిలియన్ టన్నులుగా ఉన్న సంస్థ లక్ష్యం ఏటా 10 శాతం వృద్ధితో పరుగులు పెడుతోంది. బొగ్గు ఉత్పత్తిలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తున్న సింగరేణి సంస్థ 131 వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.
సంస్థ ప్రారంభంలో ఓపెన్ కాస్టు ప్రాజెక్టులోని భారీ యంత్రాలను వినియోగించారు అధికారులు. ఇప్పుడు భూగర్భ గనుల్లోనూ ఎస్డీఎల్, ఎల్హెచ్డీ, కంటిన్యూయస్ మైనర్, లాంగ్ వాల్, హైవాల్ టెక్నాలజీతో బొగ్గు తవ్వుతున్నారు. ఓపెన్ కాస్టు ప్రాజెక్టుతో సమానంగా ఆసియా ఖండంలోనే మొదటిసారిగా సింగరేణిలో అడ్రియాల ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఓసిపిల్లో బొగ్గు తీసేందుకు గతంలో 35,60,85 టన్నుల కెపాసిటీ ఉన్న డంపర్లను వాడగా, ఇప్పుడు 100 టన్నుల కెపాసిటీ డంపర్లు ఉపయోగిస్తున్నారు. వచ్చే పదేళ్లలో కొత్తగా 14 ఓపెన్ కాస్టు ప్రాజెక్టులు, 8 భూగర్భ గనులను ప్రారంభించేందుకు 7,429 కోట్ల అంచనాతో ప్లాన్ రెడీ చేసింది సింగరేణి. దీనితో పాటు రాబోయే 5 ఏళ్లలో ఏటా వంద టన్నుల బొగ్గు వెలికితీయాలనే టార్గెట్ తో ఉంది.
బొగ్గు ఉత్పత్తితో పాటు ఇతర రంగాలపై దృష్టి పెట్టింది సింగరేణి సంస్థ. 2016 లో మంచిర్యాల జిల్లా జైపూర్ లో 1200 ల మెగావాట్ల కెపాసిటీ ఉన్న రెండు విద్యుత్ ప్లాంట్లను స్టార్ట్ చేసి విద్యుత్ ఉత్పత్తి లోనూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ లో మరో ఎనిమిది వందల మెగావాట్ల సూపర్ క్రిటికల్ కరెంటు ప్లాంట్ ఏర్పాటుకు ఈ మధ్యే పర్యావరణ అనుమతులొచ్చాయి. ఇక సోలార్ పవర్ ఉత్పత్తిపైనా దృష్టి పెట్టింది సింగరేణి సంస్థ. 1,350 కోట్లతో 300 ల మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా మొదటి దశలో 600 ల కోట్ల రూపాయలతో 129 మెగావాట్ల కెపాసిటీ గల ప్లాంట్ల పనులు జరుగుతున్నాయి. గతంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేయగా ప్రస్తుతం సొంతంగా రెండు ఎక్స్ ప్లోజివ్ ప్లాంట్స్ ఏర్పాటు చేసింది. జీతాలు చెల్లించలేని పరిస్థితి నుంచి కార్మికులు ఉద్యోగులకు లాభాల్లో వాటా పంచే స్థాయికి చేరుకుంది సింగరేణి.
వరుస సమ్మెలతో 1991 నాటికి సింగరేణి ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. 1997 నాటికి జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. కానీ సంస్థను బతికించుకోవాలని కార్మికులు అధికారుల కృషితో 2000 నుంచి సంస్థ లాభాల్లోకి వచ్చింది. 2018,19 లో సంస్థ 1766 కోట్ల రూపాయల లాభం ఘటించగా అందులో వాటా కింద 493 కోట్లను కార్మికులు ఉద్యోగులకు పంచారు. కేంద్ర రాష్ట్రాలకు ఫైనాన్స్ సపోర్టు చేస్తోంది సింగరేణి. పన్నుల కింద రాష్ట్రానికి 13,105 కోట్లు, కేంద్రానికి 14,362 కోట్లు చెల్లించింది. సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లో అభివృద్ధికీ డిస్ట్రిక్ మిల్డ్రన్ ఫండ్ ట్రస్ట్ కింద 1844 కోట్లు చెల్లించింది. ఉత్పత్తిలో కొత్త రికార్డులు సృష్టిస్తూ దేశంలోనే ఎక్కడా లేనట్లుగా లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్న సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది సింగరేణి.