17 ఏళ్ళ బాలికపై.. ఎస్ఐ వాంఛ..
posted on Jun 26, 2021 @ 4:17PM
అతనొక పోలీస్ అధికారి.. ప్రజలు తప్పు చేస్తే శిక్షించాలి. వాళ్ళని శిక్షించే అధికారం వాళ్లకు మాత్రమే కలిపించింది. అలాగే అదే ప్రజలకు తోడు ఉండాలి వెసులుబాటు కూడా కిలిపించింది మన రాజ్యాంగం. కానీ ఆ పోలీస్ తప్పులు చేస్తే.. చివరికి తన తప్పులు రుజువై జైలుపాలయితే. ఎందరికో ఆదర్శంగా నిలవాల్సింది పోయి.. కామ కోరికల కోసం ఆరాటపడి కటకటాలపాలయ్యాడు. 17 ఏళ్ల బాలికను తుపాకీ చూపించి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు ఓ ఎస్ఐ. అంతటి దారుణానికి పాలుపడ్డ అతను చివరికి జైలు ఊసలు లెక్కపెట్టారు. ఇంకా ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ అఘాయిత్య కార్యానికి బాలిక తల్లి, పెద్దమ్మ సహకరించడం మరో దారుణం.
అది చెన్నై కాశిమేడు పోలీసు స్టేషన్. అక్కడ స్పెషల్ టీం ఎస్‌ఐ గా సతీష్‌కుమార్ పనిచేస్తున్నాడు. అతను ఇటీవల మాధవరంలో భద్రత విధులు నిర్వహించాడు. ఈ నేపథ్యంలోనే ఆ ఏరియాలో ఉంటున్న రేషన్ దుకాణం మహిళలతో పరిచయం పెంచుకున్నాడు. ఇక పరిచయం తో ఆగక నిత్యం ఏదో ఒక కారణంతో రేషన్ షాపుకు వెళ్లడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అతడి కన్ను రేషన్ దుకాణంలో పనిచేసే మహిళా సిబ్బంది కూతురు(17) పై పడింది. ఆమెను ఎలాగైనా లొంగతీసుకోవాలనుకున్నాడు. అందుకు ఏం చేయాలని ఆలోచించాడు. ముందు కోడిని వలలో వేస్తే కోడి పిల్ల దాని అంతటికి అదే వస్తుందనుకుని. తన పధకం పిల్ల తల్లికి చెప్పడు. బాలిక తల్లి, పెద్దమ్మ కూడా అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తోడుగా ఉంటామని మద్దత్తు మద్దతు పలికారు. దీంతో భయపడిన బాలిక తన తండ్రికి విషయాన్ని తెలియజేసింది.
అసమర్థుడైన తండ్రి ఏమి చేయలేని పరిస్థితి కావడంతో అతడు మిన్నకుండిపోయాడు. ఇక అంతే తండ్రి అసమర్థుడు, తల్లి, పెద్దమ్మ లు అతనికి సపోర్ట్ అనుకున్నాడు.. అతనికి ఇంకా అడ్డు లేదనుకున్నాడు అతన్ని ఎవరు ఏం చేసేవాళ్ళు లేరని ఫీల్ అయ్యాడు. ఇదే అదునుగా భావించిన ఎస్ఐ సతీష్‌కుమార్ తాను చెప్పినట్టు వినకుంటే తండ్రి, తమ్ముడిని కేసుల్లో ఇరికించి జైలుకు తరలిస్తానని ఆ అమ్మాయిని బెదిరించాడు. అయినా బాలిక చిక్కలేదు. దాంతో ఎస్ఐ బాలికకు తుపాకీ గురిపెట్టి ఆమెను లైంగికంగా వేధించాడు. ఎస్ఐ ఆగడాలు తట్టుకోలేని బాలిక వాట్సాప్ ద్వారా పుళల్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా మహిళా పోలీసులు రంగంలోకి దిగి బాలిక ఫిర్యాదు మేరకు ఆమె తల్లి, పెద్దమ్మను గురువారం పోలీసులు అరెస్ట్ చేయగా.. పక్కా ఆధారాలతో శుక్రవారం ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన చెన్నై లో వెలుగు చూసింది.