పల్నాడు కలెక్టర్ గా శ్రీ బాలాజీ లట్కర్
posted on May 18, 2024 @ 4:35PM
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో, పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్ ను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాకు శ్రీకేశ్ బాలాజీ లట్కర్ ను కలెక్టర్ గా నియమిస్తున్నట్టు పేర్కొంది. ఈసీ ఈ సాయంత్రం లోగా తిరుపతి, పల్నాడు, అనంతరం జిల్లాలకు కొత్త ఎస్పీలను కూడా ప్రకటించనుంది. సీఎస్ పంపిన పేర్లను పరిశీలిస్తున్న ఈసీ కాసేపట్లో ఉత్తర్వులు వెలువరించనుంది.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం పల్నాడులో జరిగిన హింసపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎస్, డీజీపీలకు కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు భవిష్యత్తులో అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీలందరినీ ఆదేశించింది. ఈ క్రమంలోనే కమిషన్ వారి స్థాయిలో కేసులను సమీక్షించింది. చట్ట ప్రకారం, మోడల్ ప్రవర్తనా నియమావళి వ్యవధిలో, దోషులపై ఛార్జిషీట్‌ను సకాలంలో దాఖలు చేయడంపై తగిన నిర్ణయం తీసుకునేలా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతోపాటు ఆ ఘటనల నేపథ్యంలో ఇటివల పల్నాడు జిల్లా కలెక్టర్ సహా పలువురిపై చర్యలు తీసుకుంది.