Read more!

మనుషులను  జాంబీలుగా మార్చే వైరస్ రాబోతోందా?


కరోనా వైరస్ నాలుగు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అనారోగ్య సమస్యలను కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా సంభవించిన మరణాలు మాత్రమే కాకుండా దీని వల్ల చాలామందిలో కాంప్లికేషన్స్ వారి జీవనశైలికి ఇప్పటికీ ఆందోళన కలిగిస్తూనే ఉంటోంది.  ఇదిలా ఉంటే మరోవైపు కరోనా కంటే ప్రమాదకర వైరస్ రాబోతోందని.. దీని కారణంగా మనుషులు జాంబీలుగా మారిపోతారని కూడా అంటున్నారు. అసలు ఈ వ్యాక్యలలో నిజమెంత ఉందనే విషయం అందరినీ గందరగోళానికి గురిచేస్తుండగా శాస్త్రవేత్తలు మాత్రం కొన్ని విషయాలను స్పష్టంగా చెబుతున్నారు.

సినిమాలలో జాంబీలు ఎలా ఉంటారనే విషయం చూసే ఉంటారు. అటు మనుషుల్లా స్పృహలో ఉండక, ఇటు మరణించిన వారిలా శవాల్లానూ ఉండక ఇంచుమించు ట్రాన్స్ లో ఉన్న దయ్యాల్లా ఉంటారు జాంబీలు.  వీరు మనుషులను చంపాలనే కుతూహలంతో ఉంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి మనుషులలో తలెత్తే సమస్య ఉందన్న విషయం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. శాస్ర్తవేత్తలు చెబుతున్న విషయాలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి.

ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న సరస్సులు  అక్కడి చలికారణంగా గడ్డ కట్టుకునిపోయి ఉన్నాయి. ఈ సరస్సుల అంతర్భాగంలో ప్రమాదకర వైరస్లు సమాధి అయిపోయి ఉన్నాయి. అయితే గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఈ సరస్సులు క్రమంగా కరిగిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే సరస్సు అడుగున సమాధి అయిన వైరస్లు తిరిగి ఉనికిలోకి వస్తాయి. ఇవి ఉనికిలోకి వస్తే అంటువ్యాధుల తీవ్రత పెరుగుతుంది. మనుషులు చాలా తక్కువ కాలంలోనే జాంబీలుగా మారిపోతారని వైద్యులు, శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వైరస్లు గనుక వ్యాప్తి చెందాయంటే మాత్రం ప్రపంచానికి మరో కొత్త మందు, వైద్య పరిస్థితులు ఏర్పాటుచేయడం పెద్ద సవాల్ తో కూడుకుని ఉంటుంది. దీని కారణంగా ప్రపంచానికి మరో కొత్తముప్పు, ఊహించని ప్రమాదం, నష్టం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.

                                         *నిశ్శబ్ద.