గోరంట్ల మాధవ్ దారే దిక్కా.. పలువురు పోలీసు అధికారుల అంతర్మథనం?!
posted on Feb 28, 2023 5:57AM
తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణంలో.. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సమీపంలో దుకాణాల తొలగింపు నేపథ్యంలో అటు అదికార వైసీపీ శ్రేణులకు.. ఇటు విపక్ష తెలుగుదేశం నేతల మధ్య చోటు వివాదం జరిగింది. ఆ సందర్భంగా స్థానిక సీఐ మధు.. జోక్యం చేసుకోవడమే కాకుండా వైసీపీ నేతల భుజాలపైకి ఎక్కి.. మరీ మీసాలు మెలేయడం.. స్థానిక మహిళా కౌన్సిలర్‌పై బూతులతో విరుచుకపడడం.. రాయలసీమలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది.
గతంలో ఇదే జిల్లా.. ఇదే కదిరి పట్టణం సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్.. జిల్లా పోలీస్ అధికారుల సంఘం నాయకుడిగా ఉన్నారని.. అయితే ఆ సమయంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. పోలీసులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సదరు సీఐ గోరంట్ల... ప్రెస్ మిట్ పెట్టి మరీ మీసం మేలేసిన సంగతిని ఈ సందర్భంగా సీమ వాసులు గుర్తు చేసుకొంటున్నారు. ఆ తర్వాత గోరంట్ల మాధవ్ తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. జగన్ పార్టీలో చేరడం.. ఆ వెంటనే ఆయనకు హిందూపురం ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఆయన గెలిచి.. లోక్‌సభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత సదరు ఎంపీగారి న్యూడ్ వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేయడం.. దీనిపై ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం.. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్రంలోని పెద్దలకే కాదు... జాతీయ మహిళా కమిషన్ చైర్మన్‌కు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై విచారిణ జరిపి... నివేదిక అందజేయాలంటూ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ జిల్లా ఉన్నతాధికారులుకు లేఖ సైతం రాశారు కూడా అయితే ఆ తర్వాత ఈ వ్యవహారం ఏమైందో ఎవరికీ తెలియలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో గోరంట్ల మాధవ్ మాదిరిగానే.. తాజాగా సీఐ మధు వ్యవహర శైలి ఉండడం పట్ల స్థానిక ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు సీఐ మధు కూడా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా అంటు సీమ వాసులు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంకోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో పోలీస్ శాఖ.. అధికార పార్టీకి ఫేవర్‌గా పని చేస్తోందంటూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం... గత మూడున్నరేళ్లుగా ఆరోపింస్తోంది. అంతేకాదు.. గతంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై అధికార పార్టీ శ్రేణులు దాడి చేసినా.. ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపైన ఆ పార్టీ శ్రేణులే దాడులకు దిగి.... వాహనాల విధ్వంసం చేసినా.. పోలీసులు చోద్యం చూశారు.... చూస్తున్నాయి అని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఖాకీవనంలోని పలువురు ఉన్నధికారుల్లో ఓ విధమైన భయం ఆవహించిందని తెలుస్తోంది. ఓ వేళ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే.. తమ పరిస్థితి ఏమిటనే ఓ సందేహం వారిలో ప్రారంభమైందని.. అదే జరిగితే.. ఇటీవల.. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్ పోలీసుల వైఖరికి నిరసనగా చెప్పినట్లు చేస్తే... మన పరిస్థితి ఏమిటనే ఓ చర్చ పోలీస్ ఉన్నతాధికార వర్గంలో నడుస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలకు రాజీనామా చేసి.. పోలీస్ క్యాప్.. చేతిలోని లాటీ పక్కన పెట్టేసి... ఫ్యాన్ పార్టీలో చేరితే.. అయితే ఎంపీ లేకుంటే.. ఎమ్మెల్యే .. అదీ లేకుంటే.. ఆ పార్టీకి పని చేసుకొంటూ.. ఉంటే.. భవిష్యత్తులో తమకు ఎంతో కొంత రక్షణ ఉంటుందనే ఆలోచనలో కొందరు పోలీసు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అదీకాక సీఐడీ మాజీ డీజీ పి.వి. సునీల్ కుమార్ ప్రస్తుతం ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో.. భవిష్యత్తులో తమకు అలాంటి పరిస్థితులు ఎదురైతే.. అనే ఆలోచనలో పలువురు పోలీసు ఉన్నతాధికారు ఉన్నారన్న చర్చ ఏపీ పోలీస్ శాఖలో హల్‌చల్ చేస్తున్నట్లు సమాచారం.