వర్గీకరణ జరగదన్న అజ్ఞాని జగన్!
posted on Aug 1, 2024 @ 2:59PM
ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయా వర్గాలో హర్షం వ్యక్తమవుతోంది. చంద్రబాబు నాయుడు కారణంగానే వర్గీకరణ సాధ్యమవుతోందని మందకృష్ణ మాదిగ కూడా చెబుతున్నారు. 30 సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటం ఫలించడానికి చంద్రబాబు సహకారం ఎంతో వుందని ఆయన అంటున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ జరిపినందువల్ల ఎన్నో వేలమందికి విద్య, ఉద్యోగ అవకాశాలు వచ్చాయని ఆయన చెప్పారు. అయితే ఈ వర్గీకరణ జరిపినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలో వుండగా చంద్రబాబుని ఎంతో విమర్శించారు. వర్గీకరణ అనేది అసలు అసాధ్యమైన విషయమని, ఎన్నటికీ జరిగదని ఆయన బల్లగుద్ది వాదించారు. వర్గీకరణ అసాధ్యమని తెలిసి కూడా చంద్రబాబు ఆమోదించారని అప్పట్లో జగన్ విమర్శించారు. వర్గీకరణను కోర్టులు కొట్టేస్తాయని తెలిసినప్పటికీ, ఆయా వర్గాల ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు వర్గీకరణ జరిపారని జగన్ విమర్శించారు. ఈ అంశం మీద జగన్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుని అసెంబ్లీ సాక్షిగా ఎన్నో మాటలు అన్నారు. మరి ఇప్పుడు జగన్ తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో ఆయనే ఆలోచించుకోవాలి. నా ఎస్టీలు, నా ఎస్సీలు అనడం కాదు.. వాళ్ళ సమస్యల పరిష్కారం గురించి కూడా ఆలోచించాలి.