టెక్నికల్ అసిస్టెంట్ పై.. పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సర్పంచ్..
posted on Jul 14, 2021 @ 11:04AM
శాంతి, స్వేచ్ఛలకు నిలమైన మన దేశంలో విలయం మొదలవుతుంది. మనుషులను మనుషులు చంపుకునే సంస్కృతి రెచ్చిపోతుంది.. కొందరు కులాల పై దాడిచేస్తే.. మరికొందరు జాతులపై దాడులు చేస్తున్నారు.. ఇంకొందరు రాజ్యాంగంపై దాడిచేస్తున్నారు.. ఇంకొందరు ప్రభుత్వ అధికారులపై దాడిచేస్తున్నారు. మహిళా విషయమైతే ఇక చెప్పనక్కర్లేదు. పేరు ఏదైనా ప్లేస్ ఏదైనా కావొచ్చు కానీ దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకి ఈ దారుణాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.
సర్పంచ్ అనే పదవికి మన దేశంలో అత్యున్నత గౌరవం ఉంది. సర్పంచ్ అందరికి ఆదర్శనంగా ఉండాలి.. కానీ తనకు పని చేయడం లేదని.. ఒక అధికారిపై పెట్రోల్ పోసి అంటించాడు.. అది నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ఉపాధి హామీ కార్యాలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రాజుపై పాతసావ్లీ గ్రామ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రాజు గట్టిగా కేకలు వేస్తూ.. అరిచాడు. దీంతో సిబ్బంది మొత్తం ప్రమాద ఘటనకు వచ్చి రాజును కుబీర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం భైంసాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే.. కుబీర్ గ్రామంలో గ్రావెల్ వర్క్స్ విషయంలో మాస్టర్‌పై సంతకం చేయాలని సర్పంచ్ సాయినాథ్ రాజును అడిగాడు. దీంతో రాజు నిరాకరించాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సర్పంచ్ రాజుపై పెట్రోల్ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.