డ్రైనేజీ బిల్లుల కోసం.. సర్పంచుల ఫైటింగ్..
posted on Mar 27, 2021 @ 12:05PM
పంచాయితీ సాక్షిగా..సర్పంచ్ ఉప్పుసర్పంచుల గుద్దులాట. ఆ గుద్దులాట ఏ గ్రామా అభివృద్ధికోసమో కాదు. డ్రైనేజీ బిల్లుల కోసం. అంగీలు పట్టుకొని గుండీలు చినిగేలా సచివాలయంలోనే పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. భీముడు దుర్యోధనుడిలా నువ్వు ఒకటి కొడితే నేను రెండు కొడుతా అంటూ సినిమా రేంజ్‌లో కిందపడేసి కాళ్లతో తన్నుకున్నారు. వాళ్లను అదుపుచేసేందుక తోటివారు తీవ్రంగా శ్రమించారు. కానీ వారి శ్రమ వృధాగానే మిగిలింది. మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లిలో ఈ ఘటన సచివాలయం లైటు కింద వెలుగుచూసింది. చివరికి డ్రైనేజీ బిల్లుల విషయంలో ఇరువురికీ వివాదం తలెత్తినట్లు సమాచారం.
పంచాయతీ నిధులను సర్పంచ్ తలారి సాయిలు వాడుకుంటున్నారని ఉపసర్పంచ్ వెంకటేశ్ ఆరోపించారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో కార్యాలయంలోనే సర్పంచ్, ఉపసర్పంచ్ బాహుబలి ఫైట్ చేస్తూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. అక్కడైతే ఆగక పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ప్రజాప్రతినిధులు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ.. బిల్లుల విషయంలో కొట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.