అడ్డా కూలీల కడుపు కొడుతున్న ఇసుక కొరత !

 

భవన నిర్మాణంలో ముడి సరుకయిన ఇసుక మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన నియంత్రణ, దాదాపు నలభై లక్షల పైగానే ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులు, ఆ రంగం పై ఆధార పడ్డ ఉపాధి వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇసుక నిషేదం, నిరోధము, నియంత్రణ అన్నీ కలగలిసి గందరగోళం ఏర్పడుతోంది. భవన నిర్మాణంలో ఇసుక కేవలం ఒక ముడి పదార్దమే కాదు ఇంకా ఎక్కువనే చెప్పాలి. 

నిజానికి ఇసుక సరఫరా ఆగిపోవడం తో రాష్ట్రము లోని పలు ప్రధాన నగరాల్లో నిర్మాణ రంగ పరిశ్రమలో తీవ్ర ప్రభావం పడింది. భవన నిర్మాణ కార్మికులు, సిమెంట్ డీలర్లు, ఐరన్, చిప్స్ వ్యాపారస్తులు, రవాణా రంగానికి చెందిన రిక్షా, ఆటో కార్మికులు, తాపీ మేస్త్రీలు, కూలీలు, వడ్రంగి మేస్త్రీలు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితర వృత్తుల వారు గత కొన్నాళ్లుగా ఉపాధి లేక విలవిలల్లాడుతున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానం ప్రకటించడంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం రద్దయినట్టయ్యింది. అక్రమ ఇసుక తవ్వకాలు, ఇసుక దొంగ వ్యాపారం, స్మగ్లింగ్ వంటి సమస్యల వలన ఈ కొత్త విధానం అవసరం అయ్యిందని జగన్ ప్రభుత్వం చెబుతోంది. పదిహేను రోజుల్లోనే ఈ విధానం అమలులోకి వస్తుందని ప్రకటించిన ప్రభుత్వం దాదాపుగా నెలా పదిహేను రోజులు అయినప్పటికీ ఇంకా ఈ నిషేదం కొనసాగించడం భవన నిర్మాణ రంగం మీద ఆధార పడ్డవారికి తీవ్ర ఇబ్బందులు కలగ చేస్తోంది. 

ప్రభుత్వ చర్యలు ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఉండాల్సినవి పోయి లేని కొత్త సమస్యలను సృష్టించేవి కావడం శోచనీయం. దీంతో ఇసుక ధర ఆకాశాన్ని అంటుతోంది, అధికార యంత్రాంగం ఇతర జిల్లాల నుంచి ఇసుక సరఫరాకు ప్రయత్నాలు చేస్తోంది.  ఒక్క గుంటూరు జిల్లాలోనే దాదాపుగా ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉండడంతో అధికారులు ఈ కొరతను తీర్చడానికి గోదావరి జిల్లాల నుండి ఇసుకని తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈ కొరత వలన బ్లాక్ మార్కెట్ వ్యాపారులు ఇసుక ధరను అమాంతం ఆకాశానికి ఎత్తేసారు. సాధారణంగా నాలుగువేల రూపాయలుగా ఉండే ట్రక్ లోడు ఇసుక ధర అమాంతంగా ఇరవై వేలకి చేరింది. ఈ కొత్త ఇసుక విధానంలో ఇసుక రీచ్ లలో జిల్లా కలెక్టర్ అధీనంలో ఉంటాయి, ఇసుకను ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన సరఫరా చేస్తారు, స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో కావాల్సిన ఇసుక కోసం అప్ప్లై చేసుకుని రసీదు తీసుకుని సంబంధిత ఇసుక రీచ్ నుండి ఇసుకను పొందాల్సి ఉంటుంది. 

ప్రభుత్వం నిర్మిస్తున్న గృహనిర్మాణ  ప్రాజెక్ట్ లకి తోలి ప్రాధాన్యత గానూ, వ్యక్తిగత గృహ నిర్మాణాలకు ఇతర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకి రెండవ ప్రాధాన్యతగానూ, అపార్ట్మెంట్ లకి మూడవ ప్రాధాన్యతగానూ ఈ విధానం రూపొందించబడింది. ప్రస్తుత ధర ప్రకారం ట్రక్ ఇసుక రేటు మూడు వందలగానూ ముప్పై రూపాయల లోడింగ్ ఛార్జ్ గాను ఉన్నది. ఈ ఇసుక కొరత వలన సొంత ఇంటి నిర్మాణం చేసుకుంటున్న మధ్యతరగతి ప్రజల స్వగృహ స్వప్నం ఆలస్యం అవుతోంది.  

ప్రభుత్వ విధానాలు గతంలో జరిగిన తప్పులను సమీక్షిస్తూనే నిర్మాణ కార్మికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకోకుండా తీసుకున్న ఇటువంటి అనాలోచిత చర్య వలన రెక్కాడితే కానీ డొక్కాడని అసంఘటిత కార్మిక వర్గం రోడ్డున పడింది. రాష్ట్రంలో ప్రధాన పట్టణాలు అయిన విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి వంటి పట్టణాల్లో నిర్మాణ పనులన్నీ నిలిచి పోయాయి. కొనసాగుతున్న నిర్మాణాలకు ఆటకం లేకుండా, గత ప్రభుత్వం అవలంభించిన అవకతవక విధానాలను సమీక్షిస్తూనే నిర్మాణ రంగ కార్మికుల ఉపాధి పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంది

.

Teluguone gnews banner

జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారానికి కేసీఆర్ వస్తారా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి గులాబీ బాస్ కేసీఆర్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఆ క్రమంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ఈ ఎన్నిక ఫలితం ప్రభావం వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్ధ ఎన్నికలపై ఉంటుందన్న అంచనాతో ప్రధాన పార్టీలు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.  అందుకు తగ్గట్లుగానే  మూడు పార్టీలూ కూడా తమతమ పార్టీల అగ్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సీనియర్లు, అనుబంధ విభాగాల నాయకులకు బాధ్యతలు అప్పగించాయి.  అధికార, విపక్ష పార్టీలకు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో విజయం ఒక  సవాలుగా మారింది. కాంగ్రెస్ స్థానిక యువనేత, అనుభవం ఉన్న నవీన్‌యాదవ్‌కు టికెట్‌ను ఖరారు చేసింది. కాంగ్రెస్‌ పాలనకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పరీక్షగా మారడంతో.. పార్టీ దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రెండు నెలల క్రితమే మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్రావు, వివేక్‌ వెంకటస్వామిలకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఇతర మంత్రులు కూడా ఇంటింటి ప్రచారం చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట.  పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తాము ప్రభావితం చేయగలిగిన ప్రాంతాల్లో ప్రచారం చేసేలా పీసీసీ వ్యూహారచరన చేస్తుందట. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నికల్లో  గెలిస్తే రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు దారి మరింత సులువు అవుతుందని కాంగ్రెస్‌ భావిస్తుంది. గ్రేటర్‌లో పాగా వేస్తే వచ్చే స్థానిక, అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది. బీఆర్‌ఎస్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా గ్రేటర్‌లో మాత్రం తన పట్టును కోల్పోలేదు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే జీహెచ్‌ఎంసీ పీఠం తప్పక కైవసం చేసుకోవాలనే ఆలోచనలో గులాబీ దళం పని చేస్తుంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితలో కేసీఆర్ పేరును పెట్టింది బీఆర్ఎస్.  బీఆర్‌ఎస్‌ వెల్లడించిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్‌ పేరు ఉండడం ఆసక్తికరంగా మారింది. ఒకటి రెండు సభలకు కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే మూడు, నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహించిన పార్టీ అగ్ర నాయకులు, ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్‌ఎస్‌.. ప్రచార పర్వాన్ని కూడా అదేరీతిన కొనసాగిస్తోంది. ముఖ్యనేతలకు డివిజన్ల వారీగా నాయకులకి బాధ్యతను అప్పగించింది గులాబీ పార్టీ. సెంటిమెంటు, సానుభూతి అంశం తమకు కలిసి వస్తుందన్న ధీమాతో బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారట. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం కోసం మూడు ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలు, కార్యకర్తలను హైదరాబాద్‌లోనే  హరించడంతో..నియోజకవర్గంలో సందడి నెలకొంది.   బీజేపీ జూబ్లీహిల్స్‌లో మరోసారి లంకల దీపక్‌రెడ్డికి ఛాన్స్‌ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన దీపక్‌రెడ్డి మరోసారి అవకాశం ఇచ్చింది. ఇక్కడ గెలిస్తే గ్రేటర్‌ పీఠం తప్పక తమదేనని బీజేపీ భావిస్తోంది.  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే జుబ్లీహిల్స్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పటికే పార్టీ క్యాడర్‌తో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ప్రచారాన్ని వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నారు.  ప్రచారానికి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌  కూడా పాల్గొనే అవకాశం ఉందని కాషాయ దళం చెబుతున్న పరిస్ధితి. మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత జూబ్లీహిల్స్ లో వచ్చిన బైపోల్స్ లో బీఆర్ఎస్ తిరిగి మాగంటి సతీమణి సునీతకు టికెట్ ఇచ్చింది. అందరికంటే ముందుగానే బీఆర్ఎస్ తమ అభ్యర్థిని అనౌన్స్ చేసి ప్రచారం కూడా మొదలు పెట్టింది . ఈ ఉప ఎన్నికను అస్త్రంగా వాడుకుని రానున్న జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ చక్రం తిప్పాలని చూస్తుంది . గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. అయితే జూబ్లీ వార్ లో తిరిగి తమ సిట్టింగ్ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట గులాబీబాస్. అందులో భాగంగా ఎర్రవల్లి లోని ఫాంహౌస్ లో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తాజాగా నిర్వహించిన ఆ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, జూబ్లీహిల్స్ ఇంచార్జీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్  పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్స్ లిస్టును విడుదల చేసింది.  పార్టీ విడుదల చేసిన స్టార్ కాంపెయిన్ లిస్ట్ లో మొదటి పేరు కేసీఆర్ దే అవ్వడం గమనార్హం.. దీంతో గులాబీ పార్టీ వర్గాల్లో కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటారు అని చర్చ నడుస్తుంది . ఈ నెల చివరన కేసీఆర్ జూబ్లీహిల్స్ లో క్యాంపెయిన్ చేస్తారు అన్న వార్తతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఒకవేళ నిజంగానే కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటే మాగంటి సునీత గెలుపును ఎవ్వరు ఆపలేరు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది . ప్రజల్లో కేసీఆర్ మాటలకు, ఆయన వాక్చాతుర్యునికి , మంచి స్పందన ఉందనేది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి గులాబీ పార్టీ అధినేత కేసిఆర్ నిజంగానే ప్రచారంలో పాల్గొంటారో? లేదో.

సినీ ఇండస్ట్రీపై రివ్యూల ఎఫెక్ట్ !

ఓ సినిమా హిట్ అవ్వాలన్నా.. ఫట్ అవ్వాలన్నా.. దానిని డిసైడ్ చేసేది  పబ్లిక్ టాకే. అయితే.. ఇప్పుడు రివ్యూలు కూడా సినిమా ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుండటమే ఇండస్ట్రీపై ఎఫెక్ట్ పడుతుందోనే చర్చ జరుగుతోంది. వెబ్‌సైట్స్, మీమ్స్, ట్రోల్స్, హ్యాష్‌ ట్యాగ్స్.. ఇలా ప్రతీది  సినిమా రిజల్ట్‌పై ఎంతో కొంత ఇంపాక్ట్ చూపుతున్నాయ్. వాస్తవానికి, ఒకప్పటితో పోలిస్తే.. ఆరేడు ఏళ్ల నుంచే.. ఈ రివ్యూ ట్రెండ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో.. సినిమా రివ్యూలు అంటే.. జస్ట్ ఓవర్సీస్ మార్కెట్‌ వరకే పరిమితమయ్యేవి. కానీ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మూవీ రివ్యూలు, వెబ్‌సైట్లు, ట్రోలింగ్స్, మీమ్స్.. ఇలా అన్నీ ఓ మాఫియాలా క్రియేట్ చేయబడ్డాయి. కొత్తగా వచ్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ రివ్యూయర్లు, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్, మీమ్ పేజీలు.. ఇలా అంతా బ్లాక్ మెయిల్ చేసేదాకా వచ్చాయ్ పరిస్థితులు. వీళ్లలో.. కొందరిపై.. ఒకరిద్దరు నిర్మాతలు పోలీసు కేసులు కూడా పెట్టారు. నిజం చెప్పాలంటే, ఇండస్ట్రీలో పక్క సినిమాలను తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అపవాదు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ప్రతివారం 4 నుంచి 6 సినిమాలు రిలీజవుతుంటాయ్. కొందరు ప్రొడ్యూసర్లు, హీరోలు.. తమ సొంత డిజిటల్ పీఆర్ సిస్టమ్‌తో.. ట్రైలర్లకు నెగటివ్ కామెంట్లు, డిస్‌ లైక్స్, ఐఎంబీడీలో రేటింగ్స్, బుక్ మై షో యాప్‌లో లైక్స్, రేటింగ్స్, ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా నెగటివ్ క్యాంపెయిన్, పెయిడ్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లాంటివాటన్నింటికీ,   డబ్బులిచ్చి మరీ పక్క సినిమాని తొక్కడం  ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో కామన్ అయిపోయిందనే చర్చ జరుగుతోంది. అంతే కాదు.. కొందరైతే ఫేక్ కలెక్షన్ పోస్టర్లు కూడా వేసి.. హీరో ఫ్యాన్స్‌ని, ప్రొడ్యూసర్లని, మూవీ టీమ్‌ని.. అయోమయానికి గురిచేస్తున్నారు. ఇదంతా  కొన్ని పీఆర్ టీమ్‌లు ఆడుతున్న గేమే  అనే టాక్ వినిపిస్తోంది. కావాలనే.. ఇదంతా చేయిస్తున్నారని ప్రొడ్యూసర్లు అంటున్నారు. తమ సినిమాతో పాటు ఒకే వారం రిలీజయ్యే సినిమాని  రేసులో లేకుండా చేసేందుకు  అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. గతంలో  నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్లు  ఈ విషయాన్ని బాహాటంగానే మీడియా ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఈ రకమైన పీఆర్ సిస్టమ్‌తో హీరోలు, ప్రొడ్యూసర్లను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక సినిమా రిలీజ్‌కు ముందు కనిపిస్తున్న హంగామా, ప్రమోషన్లు.. సినిమా రిలీజయ్యాక అస్సలు కనిపించట్లేదు. సినిమా రిలీజ్ తర్వాత జరిగే ప్రమోషన్లపైనా ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఏ సినిమాకూ కూడా రిలీజ్ తర్వాత పెద్దగా ప్రమోషన్ ఉండటం లేదు. కొన్ని వెబ్‌సైట్లు  యాడ్స్‌తో పాటు ఆర్టికల్‌కు ఇంత, రివ్యూకు ఇంత అని తీసుకోవడం కూడా పరిపాటి అయిపోయింది.  ఓ వెబ్‌సైట్‌లో  సినిమా యాడ్ డిస్ ప్లే కావాలంటే  60 వేలు, సినిమా ప్రమోషన్ ఆర్టికల్ రాస్తే 20 వేలు, ప్రీమియర్ షోలకు వెళ్లి.. స్పెషల్ రివ్యూ రాస్తే.. లక్ష దాకా సమర్పించుకోవాలని చెబుతున్నారు నిర్మాతలు. సోషల్ మీడియాలో సినిమా రివ్యూ పోస్ట్ చేసేందుకు కూడా పాతిక వేలు తీసుకుంటున్నారట. ఫస్ట్ హాఫ్ రివ్యూకు 20 వేలు, సెకండాఫ్ రివ్యూ కాస్త ఆలస్యంగా ఇచ్చేందుకు 30 వేలు ఇస్తున్నారట. ఇవన్నీ కాకుండా.. ఆ వెబ్‌సైట్ యాజమాన్యానికి.. సినిమా నిర్మాత లక్ష రూపాయల కవర్ పంపించాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. అయితే, ప్రొడ్యూసర్లు కూడా ఈ ట్రెండ్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. రివ్యూలు చెప్పేవాళ్లు, రాసేవాళ్లు డిమాండ్ చేసినంత డబ్బులు ఇస్తున్నారు.  ప్రతి ప్రొడ్యూసర్ తన సినిమా జనాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో సొంతంగా ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు. దీనిని అదునుగా చేసుకొని ప్రమోషన్ల పేరిట  పీఆర్ టీమ్‌లు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టిస్తున్నాయనే చర్చ ఉంది. నిర్మాతలు కూడా ఈ విషయంలో ఏమీ ఆలోచించడం లేదు. సొంతంగా నిర్ణయం తీసుకొని లక్షలు ఖర్చు పెడుతున్నారు.  కానీ.. రిజల్ట్ చూశాక దెబ్బ గట్టిగా పడుతోంది. దాంతో.. ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇండస్ట్రీలోని నిర్మాతలంతా  ఒకే తాటి మీదకు వచ్చి  ఓ నిర్ణయం తీసుకుంటే  రివ్యూయర్లను కట్టడి చేయొచ్చం టున్నారు. గ తంలో 3 రోజుల వరకు రివ్యూలు రాకుండా చూడాలని.. ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించినప్పటికీ  అది ఇప్పటికీ అమల్లోకి రాలేదు. దాంతో కోట్లు ఖర్చు పెట్టి.. ఏళ్లు కష్టపడి ఓ సినిమా తీస్తే, 3 గంటల సినిమా చూసి, 3 నిమిషాల్లో రివ్యూ రాసేసి.. సినిమాను చంపేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. పోనీ, ఈ రివ్యూ రాసేవాళ్లకేమైనా సినిమా తీసేంత టాలెంట్ ఉంటుందా? అంటే అదీ లేదు. కేవలం.. తన అభిప్రాయాన్ని ప్రేక్షకుల అభిప్రాయంగా మార్చి చెప్పి  సినిమాల కలెక్షన్లను తగ్గిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఓ వైపు పైరసీ వెబ్ సైట్లు సవాళ్లు విసురుతున్న క్రమంలో, మరోవైపు వెబ్ సైట్లు కూడా నిర్మాతలకు తలనొప్పిగా మారాయ్.  ఎన్ని నెగటివ్ రివ్యూలు ఇచ్చినా,  సోషల్ మీడియాలో ఎంత నెగటివ్ ప్రచారం చేసినా, కంటెంట్ ఉన్న సినిమాని ఎవ్వరూ ఆపలేరు. కంటెంట్ లేని సినిమాని  ఏం చేసినా లేపలేరు. ఇదే వాస్తవం.  సినిమా ఇండస్ట్రీలో  కంటెంట్ మాత్రమే కింగ్. దానిని  నమ్మితే చాలు. అయినా మౌత్ టాక్‌ని మించిన రివ్యూ మరొకటి లేదు. ఇది ఎవడో, ఎక్కడో కూర్చొని డిసైడ్ చేసేది కాదు. ఆడియెన్స్  ఒరిజినల్ ఫీలింగ్.  ప్రేక్షకులకు గనక సినిమా నచ్చితే కచ్చితంగా ఆదరిస్తారు. ఊహించిన దానికంటే  ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఇది.. ఎన్నోసార్లు రుజువైంది. ఇక ముందు కూడా అదే జరుగుతుందని బలంగా చెబుతున్నారు.

మూడు పార్టీలకూ ప్రిస్టీజియస్.. జూబ్లీహిల్స్ బైపోల్

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఎట్టి పరిస్ధితుల్లో బైపోల్‌లో విజయం సాధించక తప్పని పరిస్ధితి మూడు ప్రధాన పార్టీలది. ఈ గెలుపు మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. జూబ్లీహిల్స్‌ విజయం రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా మారబోతుంది. దీంతో విజయం కోసం మూడు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత లాగా జూబ్లీహిల్స్‌ గెలుపు రానున్న రోజుల్లో రచ్చ గెలిచేలా చేస్తుందని మూడు ప్రధాన పార్టీలూ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.   జూబ్లీహిల్స్ నామినేషన్ల పర్వం ముగయడంతో  మూడు ప్రధాన పార్టీలూ ప్రచారంపై ఫోకస్ పెంచాయి. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఈ ఎన్నిక ఫలితం ప్రభావం వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్ధ ఎన్నికలపై ఉంటుందన్న అంచనాతో ఆయా పార్టీలు ఈ బైపోల్ లో విజయాన్ని  ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.  అందుకు తగ్గట్లుగానే  మూడు పార్టీలూ కూడా తమతమ పార్టీల అగ్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సీనియర్లు, అనుబంధ విభాగాల నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పగించేశాయి. నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి కావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు మూడు పార్టీలు యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెడుతున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీకి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో గెలుపు సవాలుగా మారింది.  స్థానిక యువనేత, అనుభవం ఉన్న నవీన్‌యాదవ్‌కు టికెట్‌ను ఖరారు చేసింది. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానంలో గెలవడం ద్వారా స్ట్రాంగ్ మేసేజ్ ఇవ్వడానికి కాంగ్రెస్ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్‌ పాలనకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక లిట్మస్ టెస్ట్ గా మారడంతో.. పార్టీ దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రెండు నెలల క్రితమే మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్రావు, వివేక్‌ వెంకటస్వామిలకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.  మంత్రులకు సహకారం అందించేందుకు డివిజన్ల వారీగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు ఇన్‌చార్జులుగా బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఇతర మంత్రులు కూడా ఇంటింటి ప్రచారం చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తాము ప్రభావితం చేయగలిగిన ప్రాంతాల్లో ప్రచారం చేసేలా పీసీసీ వ్యూహారచరన చేస్తున్నది. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నికల్లో  గెలిస్తే రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో విజయానికి మార్గం సుగమం అవుతుందని కాంగ్రెస్ భావిస్తున్నది.   గ్రేటర్‌లో పాగా వేస్తే వచ్చే స్థానిక, అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలం చేకూరుతుందన్నది కాంగ్రెస్ ఉద్దేశం. ఇక బీఆర్‌ఎస్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా గ్రేటర్‌లో మాత్రం   పట్టు నిలుపుకుంది. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే జీహెచ్‌ఎంసీ పీఠం తప్పక కైవసం చేసువచ్చన్నది గులాబిదళం భావనగా కనిపిస్తోంది.   గ్రేటర్‌ పీఠాన్ని కొట్టి  స్థానిక ఎన్నికల్లో బలాన్ని మరింత పెంచుకొని అసెంబ్లీ ఎన్నికల నాటికి  మూడోసారి తెలంగాణలో అధికారాన్ని పొందాలని బీఆర్ఎస్ చూస్తోంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.  ఇప్పటికే ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితలో కేసీఆర్ పేరు ఉండటంతో ఆయన ప్రచారపర్వంలోకి దిగుతారని అంతా భావిస్తున్నారు.  ఇప్పటికే మూడు, నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహించిన పార్టీ అగ్ర నాయకులు, ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్‌ఎస్‌.. ప్రచార పర్వాన్ని కూడా అదే రీతిన కొనసాగిస్తోంది. ముఖ్యనేతలకు డివిజన్ల వారీగా  బాధ్యతను అప్పగించింది గులాబీ పార్టీ. సెంటిమెంటు, సానుభూతి అంశం తమకు కలిసి వస్తుందన్న ధీమాతో బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. లేటుగా అయినా లేటెస్ట్‌ అంటూ..బీజేపీ కూడా తగ్గేదేలే అంటోంది. బీజేపీ జూబ్లీహిల్స్‌లో మరోసారి లంకల దీపక్‌రెడ్డికి ఛాన్స్‌ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన దీపక్‌రెడ్డి మరోసారి అవకాశం ఇచ్చింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్‌లో ఓ వర్గం ఓట్లు రెండు పార్టీలు పంచుకుంటే, మరోవర్గం, సెటిలర్లు, కాలనీ, కమ్యూనిటీ ఓట్లు తప్పక తమకు వస్తాయని భావనలో బీజేపీ ఉంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీతో 48 డివిజన్లను కైవసం చేసుకోవడం బీజేపీ అవకాశంగా భావిస్తుందట. ఇక్కడ గెలిస్తే గ్రేటర్‌ పీఠం తప్పక తమదేనని బీజేపీ నమ్మకంగా ఉంది.   కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే జుబ్లీహిల్స్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉండటంతో ఆయన ఇప్పటికే పార్టీ క్యాడర్‌తో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ప్రచారాన్ని వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలోని ఏడు డివిజన్ల బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన పలువురు సీనియర్‌ నాయకులకు పోలింగ్‌ బూత్‌, శక్తి కేంద్రాల బాధ్యతలు అప్పగించారు. ఇక ప్రచారానికి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌  కూడా పాల్గొనే అవకాశం ఉందని కాషాయ దళం చెబుతున్నది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం కోసం మూడు ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలు, కార్యకర్తలను హైదరాబాద్‌లోనే మోహరించడంతో.. నియోజకవర్గంలో సందడి నెలకొంది. రసవత్తరంగా మారనున్న ఉప ఎన్నిక ప్రచారంలో మూడు పార్టీలు ఎలా ముందుకు వెళ్లబోతున్నాయనేది వేచి చూడాలి.

తిరువూరు తుఫాన్ ఏ తీరం చేరేనో?

మొన్న‌టి వ‌ర‌కూ దేవుడ్న‌యిన నేను స‌డన్ గా  దెయ్యాన్ని ఎలా అయ్యాను? ఇదీ బెజ‌వాడ ఎంపీ కేశినేని చిన్ని చేసిన కామెంట్. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస‌రావు అంటేనే అదో నాన్ స్టాప్ న్యూసెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా పేరు. ప్ర‌త్యేకించి ఒక‌రొచ్చి ఇదేంటి అని వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న ఏమ‌ని తిరువూరు ఎమ్మెల్యేగా ఎంపిక‌య్యారో అప్ప‌టి నుంచి న‌డుస్తోన్న త‌తంగ‌మంతా ఒక్క‌సారి రీకాల్ చేసి చూస్తే చాలు.. ఒక క్లారిటీకి రావ‌చ్చు. తాజాగా కొలికపూడి మ‌రో వివాదం రాజేశారు.  ఎంపీ చిన్ని త‌న‌ను ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగార‌ంటూ బాంబు పేల్చారు. అంతే కాదు.. తాను ఇచ్చాన‌ని చెప్ప‌డానికి  త‌గిన ఆధారాలు సైతం చూపించారు. మొద‌ట చిన్ని పీఏకి యాభై ల‌క్ష‌లు ఇచ్చామ‌నీ.. ఆపై త‌న స్నేహితుల ద్వారా 3. 5 కోట్ల రూపాయ‌లు ఇచ్చామ‌ని.. త‌న బ్యాంకు డీటైల్స్ తో స‌హా కొలికిపూడి మీడియాకి లీక్ చేయ‌డంతో చిన్నికి ఏం చేయాలో పాలు పోలేదు. అది కూడా ఎంత నాట‌కీయంగా అంటే..  గురువారం (అక్టోబర్ 23) ఉద‌యం నుంచి తిరువూరులోనే ఉన్న ఎంపీ చిన్ని వివిధ ర‌కాల కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అయితే  ఎమ్మెల్యే కొలికపూడి ఆ కార్యక్రమాలకు హాజరు కాకుండా.. ఈ మ‌నీ మేట‌ర్  లీక్ చేసే స‌రికి తెలుగు త‌మ్ముళ్లకు దిమ్మ తిరిగిపోయింది. ఈ విష‌యం హుటాహుటిన యూఏఈలో ఉన్న బాబుకు తెలియ చేయ‌గా.. ఆయ‌న ఆగ్ర‌హించి.. వీరిద్ద‌రితో మాట్లాడ్డానికి స‌సేమిరా అన్నారు. ఇదే అంశంపై చిన్ని మాట్లాడుతూ.. తన‌కు అధిష్టానం నుంచి ఎలాంటి పిలుపు రాలేద‌ని అన్నారు. తాను రోజుకో ర‌కంగా వ్య‌వ‌హ‌రించే వైసీపీ మైండ్ సెట్ తో లేన‌ని.. త‌న  బార్న్అండ్  బ్రాట‌ప్ మొత్తం టీడీపీయేని చెప్పుకున్న కేశినేని చిన్ని.. తాను ఫ‌క్తు టీడీపీ వాదిన‌న్నారు. తానేంటో విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసున‌ని.. త‌న సొంత ఖ‌ర్చుతో విజ‌య‌వాడ ఉత్స‌వాలు జ‌రిపాన‌ని.. మ‌ర‌లాంటి త‌న‌కు ఏంటీ ఈ లంచాల గోల‌? అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇక కొలికపూడి  విషయానికి వస్తే.. ఆయ‌న త‌న ఫేస్ బుక్ స్టేట‌స్ లో ర‌క‌ర‌కాల కామెంట్ల‌ను పెట్టి పార్టీలో ఒక‌ర‌క‌మైన అల‌జ‌డికి కార‌కుడ‌య్యారు. ఎవ‌రంటే వారొచ్చిపోయేది కాదు తిరువూరు అంటూ ఆయ‌న చేసిన కామెంట్ల‌కు అర్ధ‌మేంట‌ని బుర్ర గోక్కున్నాయి పార్టీ శ్రేణులు. ఎంపీ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌డానికి ఎమ్మెల్యే ప‌ర్మిష‌న్ కావాలా? అంటూ నిలదీస్తున్నాయి.   ఇప్ప‌టికే ప‌లు మార్లు.. తిరువూరు వ్య‌వ‌హారం టీడీపీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.  తాజాగా ఇప్పుడు మ‌రొక‌టి. ఇదెంత పెద్ద వ్య‌వ‌హారం అంటే.. ఏకంగా ఒక పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఇష్యూ. ఈ మేట‌ర్లో.. ఇటు ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎంపీ మాత్ర‌మే కాదు.. పార్టీ ప‌రువు ప్ర‌తిష్ట‌లు మొత్తం దాగి ఉండ‌టంతో.. త‌మ్ముళ్ల‌లో తెగ‌ చ‌ర్చ న‌డుస్తోంది. కొంద‌రైతే.. అర్హులు కాని వారిని అంద‌ల‌మెక్కిస్తే ఇలాగే ఉంటుంద‌ని కొలికపూడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఆనాడు టీడీపీకి  ప్రోగా కొలికిపూడి కామెంట్లు చేస్తే.. ఎంతో గొప్ప మ‌ద్ధ‌తుదారుడు దొరికాడ‌ని సంబ‌ర ప‌డ్డాం.. ఇప్పుడు చూస్తే నాటి వైసీపీ రెబ‌ల్ ఎంపీ కి మించి పెర్ఫామెన్స్ చేస్తున్నారీరెబ‌ల్ ఎమ్మెల్యే అంటూ కొంద‌రు త‌మ్ముళ్లు సామాజిక  మాధ్య‌మాల్లో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మ‌రి చూడాలి..  ఈ తిరువూరు తుఫాన్ ఏ తీరం చేర‌నుందో ?

జగన్ ఫోన్ కహానీ!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాను ఏం మాట్లాడినా జనం నమ్మేస్తారనుకుంటారు. కాదు కాదు నమ్మితీరాలని భావిస్తారు.  అందుకే ఆయన ఇసుమంతైనా సంకోచం లేకుండా తనకు అసలు ఫొనే లేదని నిస్సంకోచంగా చెప్పేయగలరు. కానీ తన విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి ఇస్తూ కాంటాక్ట్ నంబర్ ఇచ్చి తీరాలన్న ఆదేశంతో ఓ నంబర్ ఇచ్చేసి లండన్ పర్యటనకు వెళ్లిపోయారు. ఆ పర్యటన పూర్తి చేసుకుని తిరిగి కూడా వచ్చేశారు. అయితే ఆయన సీబీఐకి ఇచ్చిన ఫోన్ నంబర్ ఆయనది కాదని తేలడంతో ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అయినా కూడా పాత పాటనే పట్టకు వేళాడుతున్నారు. తనకు అసలు ఫోనే లేదని గట్టిగా చెప్పడమే కాదు.. తాను వాడేది సిబ్బంది ఫోన్లనే నని. అందుకే వారిలో ఒకరి ఫోన్ ను తన కాంటాక్ట్ నంబర్ గా ఇచ్చాననీ చెబుతున్నారు.  గతంలోనూ జగన్ సొంత ఫోన్ నెంబర్ ఇవ్వలేదని.. సిబ్బందిలో ఒకరి ఫోన్ నెంబర్లు ఇచ్చి విదేశీ పర్యటనకు వెళ్లారని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ వాదనతో కోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది పక్కన పెడితే..  అసలు జగన్ రెడ్డికి సొంతంగా అంటే వ్యక్తిగతంగా ఫోన్ లేదనడం నిజమేనా?  అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక రాజకీయపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ కు ఫోన్ లేదనడం, ఆయన అసలు ఫోన్ ను వినియోగించరనడం ఇసుమంతైనా నమ్మశక్యంగా లేదు. ఆయన ఏ అవసరం వచ్చినా సిబ్బంది ఫోన్లు వినియోగిస్తారన్నది మాటవరసకు నిజమే అని అనుకున్నా.. కుటుంబ సభ్యులతో మాట్లాడడానికీ వారి ఫోన్లే వినియోగిస్తారా? విదేశాలలో ఉండే కుమార్తెలు తండ్రికి ఫోన్ చేయాలన్నా.. ఆయన సిబ్బంది ఫోన్ కే కాల్ చేస్తారా?  అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తంగా జగన్ తన ఆస్తులను బినామీల పేర్ల మీద పెట్టినట్లే.. సొంతానికి వాడుకునే ఫోన్ ను కూడా బీనామీ పేరుతోనే తీసుకుని ఉంటారని పరిశీలకులు విశ్లేషి స్తున్నారు.   విదేశాలకు వెళ్లేందుకు అనుమతి పొందిన ఆయన.. కోర్టు షరతులను ఉల్లంఘించారని సీబీఐ అంటోంది. ఆయన ఇటీవలి లండన్ పర్యటన సందర్భంగా ఆయన ఇచ్చిన కాంటాక్ట్ నంబర్ ద్వారా ఆయనను కాంటాక్ట్ చేయడానికి కానీ, ట్రాక్ చేయడానికి కానీ అవకాశం లేకుండా పోయిందని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  దీంతో జగన్ ఫోన్ బాగోతం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

ఆ మూడు రాష్ట్రాలకూ కడుపు మంట ఎందుకు?

  ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ సంస్థ దేశంలోనే అతి పెద్ద పెట్టుబడి పెట్టేందకు ముందుకు రావడం పట్ల దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు చాణక్యాన్నీ, పెట్టుబడుల ఆకర్షణ విషయంలో చూపుతున్న ప్రతిభ పట్ల ప్రపంచం మొత్తం అచ్చెరువోందుతోంది. అయితే  దక్షిణాదికి చెందిన మూడు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు మాత్రం కడుపుమంటతో గిలగిలలాడుతున్నాయి. వాటితో పాటు.. ఆంధ్రప్రదేశ్లో జనం ఇవ్వకపోయినా, విపక్ష హోదా కోసం నానాయాగీ చేస్తూ ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీని కూడా బహిష్కరించి, ప్రెస్ మీట్లలో ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమౌతున్న వైసీపీ కూడా గొంతు కలుపుతోంది.  ఇంతకీ ఆ మూడు రాష్ట్రాలూ ఏవంటే.. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే.. ఇప్పటికే హైదరాబాద్ మహానగరం ఐటీ హబ్ గా గుర్తింపు పొందింది. కావలసినంత ప్రభుత్వ భూమి ఉంది. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అయినా కూడా ఏపీతో పోటీ పడటంలో వెనుకబడింది. దీనిపై రాష్ట్రంలో చిన్నసైజు రాజకీయ రచ్చ కూడా జరుగుతోంది.  ఇక బెంగళూరు విషయానికి వస్తే..  అక్కడ అధికారంలో ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వం నిష్క్రియాపరత్వం కారణంగా ఉన్న కంపెనీలే పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నాయి. అలాంటి పరిశ్రమలకు ఏపీ ఆహ్వానం పలకడం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఈ పరిస్థితుల్లో గూగుల్ వంటి అగ్రసంస్థ భారీ పెట్టుబడితో ఏపీలో అడుగుపెట్టడంతో అనుచిత రాయతీలతో ఏపీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని శాపనార్ధాలు పెడుతోంది.  ఇక తమిళనాడు కడుపుమంట మరో టైపు. గూగుల్ సీఈవోగా తమ రాష్ట్రానికి చెందిన సుందర్ పిచాయ్ ఉన్నా కూడా ఆ సంస్థ అంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడానికి ఏపీని ఎన్నుకోవడమేంటంటూ అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే సర్కార్ ను విపక్షాలు ఏకిపారేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుతం సాధించారు, మీరేం చేస్తున్నారంటూ విశ్లేషకులు టీవీ టాక్ షోలలో స్టాలిన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.  ఇంతకీ ఏపీ ఈ స్థాయిలో ప్రపంచం నలుమూలల నుంచీ పెట్టుబడులను ఆకర్షించగలుగుతోందంటే అందుకు ఇక్కడ ప్రభుత్వాధినేతకు రాష్ట్ర ప్రగతి పట్ల ఉన్న చిత్తశుద్ధి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇంతకీ దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాల ఆగ్రహం, అసూయకు కారణమేంటయ్యా అంటే ఏపీ ప్రగతి ఆయా రాష్ట్రాలలో వారికి పొలిటికల్ గా నష్టం చేస్తుందన్న భయమేనంటున్నారు. 

ప్రచారం చేస్తారా.. ఫాం హౌస్ ప్రకటనలకే పరిమితమౌతారా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలోనైనా  ఫామ్ హౌస్ వీడి బయటకు వచ్చి ప్రచారం చేస్తారా? లేక  ప్రకటనలకే పరిమితమౌతారా? అన్న చర్చ జోరుగా జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆయన బహిరంగంగా సభలూ, సమావేశాలలో పాల్గొన్న సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అంతకు ముందు నిత్యం ప్రజలతో మమేకమై ఉండే కేసీఆర్.. పార్టీ అధికారం కోల్పోయిన తరువాత పూర్తిగాక్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏమైనా చెప్పదలచుకున్నా ఎంపిక చేసుకున్న నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడి పంపిస్తున్నారు.  ఇప్పుడు బీఆర్ఎస్ కు చావో రేవో అన్నట్లుగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ అయినా ఆయన పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వస్తారా లేదా అన్న అనుమానం రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తున్నది. బిఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ దాదాపుగా రాజకీయ అస్త్రసన్యాసం చేశారా అనిపించేలా ఆయన ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు.  అధికారం కోల్పోయిన తరువాత పార్టీ రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొంది. స్వయంగా ఆయనే కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావాల్సి వచ్చింది. పలు అవినీతి ఆరోపణలూ పార్టీ కీలకనేతలపై వచ్చాయి. చివరకు కన్న కూతురే పార్టీకి రాజీనామా చేసినా.. కేసీఆర్ మౌనం వీడలేదు. ఫామ్ హౌస్ దాటి అడుగుబయటపెట్టలేదు.  ఇక జూబ్లీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను కూడా ఫామ్ హౌస్ కు పిలిపించుకుని అక్కడే పార్టీ బీఫామ్ అందజేశారు. దీంతో ఇప్పుడు   కేసీఆర్ ఈ ఉప ఎన్నికల కోసం ప్రజా క్షేత్రంలోకి వస్తారా? పార్టీ గెలుపు కోసం మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేస్తారా?  అంటే  బీఆర్ఎస్ శ్రేణులే  నమ్మకంగా ఔనని సమాధానం చేప్పలేకపోతున్నారు.   అయితే కేసీఆర్ తరువాత పార్టీ   బాధ్యతలు మోయడానికి సిద్దమైన కేటీఆర్ ఈ ఉపఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇక్కడ విజయం ఆయనకు, ఆయన నాయకత్వ సమర్థతకు లిట్మస్ టెస్ట్ లాంటిదని చెప్పవచ్చు. అందుకే  జరుగుతున్నది ఉప ఎన్నికే అయినా ఇది రేవంత్ ప్రభుత్వ ప్రతిష్ఠతకు,  కేటీఆర్  నాయకత్వ పటిమకు పరీక్ష అనడంలో సందేహం లేదు.  అందుకోసమైనా, కేటీఆర్ ను పార్టీలో తిరుగులేని నాయకుడిగా నిలబెట్టడానికైనా కేసీఆర్ జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని పార్టీ కేడర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. కేసీఆర్ కనుక ఒక సారి ప్రజాక్షేత్రంలోకి వచ్చి తన గళం వినిపిస్తే.. ఇప్పటిదాకా పార్టీని చుట్టుముట్టిన సమస్యలన్నీ దూదిపింజెల్లా తేలిపోతాయని క్యాడర్ నమ్ముతోంది.  పరిశీలకులు సైతం అదే అంటున్నారు.  అయితే కేసీఆర్ ఇప్పుడు కూడా పామ్ హౌస్ కే పరిమితమై అజ్ణాతవాసాన్ని కొనసాగిస్తే మాత్రం ముందుముందు బీఆర్ఎస్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్ ఇప్పుడైనా క్రియాశీలంగా మారి.. జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ తరఫున విస్తృతంగా ప్రచారం చేయకుంటే... సపోజ్ ఫర్ సపోజ్ ఈ ఉప ఎన్నిక ఫలితం బీఆర్ఎస్ కు అనుకూలంగా రాకపోతే.. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ మనుగడ, ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతోంది.  అందుకే బీఆర్ఎస్ నీటమునిగినా, పాలమునిగినా అందుకు కారణం కేసీఆర్ అవుతారని అంటున్నారు.  

కొంచమైనా లాజిక్ చూసుకోండయ్యా బాబూ..!

రాజకీయాలలో ప్రత్యర్థి పార్టీల మధ్య విమర్శలు సహజం. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీపై అధికారంలో లేని పార్టీ, ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా విమర్శలు చేస్తుంటుంది. ప్రభుత్వ విధానాలను ఎండగడుంటుంది. అందులో తప్పుపట్టాల్సిన అవసరం ఇసుమంతైనా లేదు. అయితే ఏ విమర్శలోనైనా, విమర్శకైనా హేతువు అన్నది ఉండాలి.  అలా హేతురహితంగా చేసే విమర్శల వల్ల ప్రయోజనం సంగతి అటుంచితే రివర్స్ లో నవ్వుల పాలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ చేస్తున్న విమర్శలు, వ్యవహరిస్తున్న తీరు అలాగే నవ్వుల పాలౌతోంది.  ఏ రాజకీయ పార్టీకైనా ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది. ఒక విధానం అంటూ ఉంటుంది. ఆ సిద్ధాంతానికీ, విధానానికీ కట్టుబడి ఉన్న పార్టీ చేసే విమర్శలకు ఒకింత విలువ ఉంటుంది. ఆ పార్టీ చేసే విమర్శల్లో లాజిక్ ఉంటే జనం కూడా మద్దతు ఇస్తారు. అలా కాకుండా.. నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తాం,  ప్రతి అంశాన్నీ రాజకీయం చేసి లబ్ధిని వెతుక్కుంటాం అంటూ జనం నవ్వి పోతారు. పట్టించుకోవడం మానేస్తారు.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి అదే పరిస్థితి ఎదురౌతోంది.  విశాఖ‌ప‌ట్నానికి ప్ర‌తిష్టాత్మ‌క‌ గూగుల్ డేటా సెంట‌ర్, ఏఐ హ‌బ్ రావ‌డం పట్ల రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలూ, మేధావులు, వ్యాపార వాణిజ్య వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.   80 వేల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డితో గూగుల్.. ఈ డేటా సెంట‌ర్‌, ఏఐ హ‌బ్‌ల‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తుండటం దేశ వ్యాప్తంగా అందరి దృష్టీ ఏపీపై పడేలా చేసింది. తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన 18 నెలల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఏపీ ప్రతిష్ట, ఏపీ సీఎం ప్రతిష్ట ఒక్కసారిగా ఆకాశం ఎత్తుకు పెరిగాయి.    పైగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఏఐహబ్  ఏర్పాటుల గురించి కేంద్రం స్వయంగా హస్తినలో  ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసి ఈ భారీ పెట్టుబ‌డుల గురించి దేశానికి తెలియ‌జేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ మధ్య జరిగిన ఒప్పందంపై సంతకాల సందర్భంగా కేంద్ర మంత్రులు ప్రత్యక్షంగా హాజరయ్యారు.    మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి భారీ పెట్టుబ‌డులు వ‌చ్చిన‌పుడు ప్ర‌తిప‌క్షాలు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తాయి. ఏపీలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అంటూ లేకపోయినా, ప్రత్యర్థి పక్షంగా ఉన్నవైసీపీ ప్రశంసించలేదు సరికదా, ఈ విషయంపై రాజకీయం చేయడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నించింది.  మొదట గూగుల్ డేటా సెంటర్ల వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏముందంటూ పెదవి విరిచింది. ఈ డేటా సెంటర్ వల్ల వచ్చేది కేవలం ఓ రెండు వందల ఉద్యోగాలు మాత్రమేననీ, డేటా సెంట‌ర్ల‌కు నీళ్లు భారీగా అవ‌స‌రం ప‌డ‌తాయ‌ని.. దీని వ‌ల్ల వైజాగ్‌లో నీటి స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని.. విద్యుత్ వినియోగం పెరిగి జ‌నం మీద భారం ప‌డుతుంద‌ని.. ఇలా తెలుగుదేశం కూటమి సర్కార్ సాధించిన ఈ  బ్రహ్మాండమైన  ఎఛీవ్ మెంట్ ను తక్కువ చేసి చూపడానికి వేయగలిగినన్ని కుప్పిగంతులు వేసింది.  సరే వైసీపీ విమర్శలకు తెలుగుదేశం కూటమి పార్టీలు దీటుగానే బదులిచ్చాయి. అది వేరే విషయం. అయితే అదే వైసీపీ గూగుల్ డేటాసెంటర్, ఏఐహబ్ వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని విమర్శించడంతో ఊరుకోలేదు.. అదే సమయంలో రాష్ట్రానికి గూగుల్ రావడంలో క్రెడిట్ అంతా జగన్ దే అంటోంది. ఒకే సమయంలో రెండు రకాలుగా వైసీపీ మాట్లాడుతోంది.  జ‌గ‌న్ హ‌యాంలో అదాని వైజాగ్‌లో డేటా సెంట‌ర్ పెట్ట‌డానికి ముందుకు వ‌చ్చారనీ, ఇప్పుడు గూగుల్‌తో అదానీ అసోసియేట్ అవుతున్నాడు కాబ‌ట్టి ఈ భారీ పెట్టుబ‌డి తాలూకు క్రెడిట్ కూడా జ‌గ‌న్‌దే వైసీపీ నేతలు సొంత డప్పు వాయించుకుంటున్నారు. ఓవైపు డేటా సెంట‌ర్ల‌తో ప్ర‌యోజ‌నం లేద‌ని, అంతా నాశ‌నం అని విమర్శిస్తూనే.. ఈ క్రెడిట్‌ను జ‌గ‌న్‌కు క‌ట్టబెట్ట‌డానికి తాప‌త్ర‌య ప‌డ‌డం వైసీపీని నవ్వుల పాలు చేస్తున్నది. హేతుబద్ధత లేకుండా విమర్శలు చేయడం, మళ్లీ అదే సమయంలో అధికార పార్టీ క్రెడిట్ కూడా తన ఖాతాలో వేసేసుకోవడానికి తాపత్రేయ పడటం వైపీపీ ప్రతిష్టను మరింత దిగజారుస్తోంది. 

ఆనవసర ఆపరేషన్లతో నిలువుదోపిడీ.. దేశంలో వైద్య విలువలు పతనం?

దేశంలో చికిత్స, వైద్యం పేరున అంతులేని దోపిడీ జరుగుతోంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ పార్లమెంటరీ కమిటీయే అంగీకరించింది. దేశంలో ఆరోగ్య రంగం పతనం అంచున ఉందని నివేదికలు చెబుతున్నాయి. విషయమేంటంటే దేశంలో జరుగుతున్న ఆపరేషన్లలో 44శాతం వరకూ నకిలీవేనని ఒక వార్తా సంస్థ నివేదిక కుండబద్దలు కొట్టింది. అంటే అవసరం లేని, మోసపూరితంగా ఆపరేషన్ల పేర ఆస్పత్రులు ప్రజలను దోచుకుంటున్నాయని వెల్లడించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఆరోగ్యం విషయంలో ప్రజలలో ఉన్న భయాన్ని సొమ్ము చేసుకుంటున్నాయన్న మాట.  ఆ వార్తా సంస్థ నివేదిక ప్రకారం దేశంలో గుండె ఆపరేషన్లు అంటూ చేస్తున్న శస్త్రచికిత్సల్లో 55 శాతం అవసరంలేనివే. అలాగే గర్భాశయం తొలగించే శస్త్రచికిత్సలు, మోకాలి మార్పిడి ఆపరేషన్లు, ఇక క్యాన్సర్ ఆపరేషన్లలో కూడా దాదాపు సగం అనవసరమైనవేనని నివేదిక వెల్లడించింది. అలాగే నార్మల్ డెలివరీ అయ్యే కేసులలో కూడా   కానుపు కష్టమౌతుందంటూ ఆస్పత్రులు సిజేరియన్లే చేస్తున్నారని ఆ వార్త సంస్థ నివేదికలో తేలింది. దేశంలో జరిగే సిజేరియన్ ఆస్పత్రులలో 45 శాతానికి పైగా అనవసరమైనవేనని పేర్కొంది.   ఇలా అనవసరమైన ఆపరేషన్లు, లేదా నకిలీ ఆపరేషన్లు చేయడానికి ఆస్పత్రులు వైద్యులకు నెలకు కోటి రూపాయల వరకూ వేతనాలిచ్చినియమించుకుంటున్నాయని పేర్కొంది. మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలోని  ప్రముఖ ఆస్పత్రులలో ఈ వార్తా సంస్థ సర్వే నిర్వహించి మరీ ఈ వివరాలను వెల్లడించింది.   ఇంకా దారుణమైన విషయమేంటంటే.. తమ ఆస్పత్రులలో పని చేస్తున్న వైద్యులలో ఎవరు ఎక్కువ మెడికల్ టెస్టులు చేయిస్తారో, ఔట్ పేషెంట్లుగా వచ్చిన వారిలో ఎక్కవ మందిని ఇన్ పేషెంట్లుగా చర్చుతారో, అలాగే ఎవరు  అవసరం, అనవసరంతో సంబంధం లేకుండా అధిక ఆపరేషన్లు చేస్తారో వారికి వేతనాల పెంపు, బోనస్ లు దక్కుతున్నాయని కూడా సర్వే తేల్చింది.   అంతే కాకుండా ఠాకూర్ సినిమాలో చూపించిన విధంగా రోగి మరణించిన తరువాత కూడా అతని పరిస్థితి విషమంగా ఉందంటూ చికిత్స చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆ సర్వేలో వెల్లడైనట్లు తెలిపింది.   ఈ రకంగా దేశంలో జరుగుతున్న వైద్య మోసాలను పార్లమెంటరీ కమిటీ కూడా ధృవీకరించింది. మోసాలు బయటపడిన సందర్భాలలో ఆయా ఆస్పత్రులకు జరిమానాలు విధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే మోసం ద్వారా వచ్చే ఆదాయంతో పొలిస్తే జరిమానాలు చాలా చాలా తక్కువగా ఉండటంతో ఆస్పత్రులు మోసం బయటపడినప్పుడు జరిమానా చెల్లించి చేతులు దులిపేసుకుని తమ దందాను మళ్లీ యథా ప్రకారం కొనసాగిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

కూటమి పాల‌న‌లో ప‌వ‌న్ పేజీలు కొన్ని మిస్సింగ్?

మాములుగా ప్ర‌తి ప్ర‌భుత్వ కార్యాల‌యంలో ఇటు సీఎం చంద్ర‌బాబుతో పాటు, అటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోటోలు కూడా పెడుతుంటారు. అంటే ముఖ్య‌మంత్రే కాక, ఉప ముఖ్య‌మంత్రి కి కూడా ప్ర‌భుత్వంలో విలువ ఉంద‌ని చెప్ప‌డానికిదో నిద‌ర్శ‌నం అన్న‌మాట‌. అలాంటిది కొన్ని ప్ర‌భుత్వ  కార్య‌క‌లాపాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు క‌నిపించ‌రు? తాజాగా సీఆర్డీఏ భ‌వ‌న ప్రారంభోత్స‌వ‌మే తీసుకుందాం. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ ఎందుకు దూరంగా ఉన్నారు? అన్న‌దిపుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇదేమంత చిన్న విష‌యం కాదు. ఎందుకంటే ఇక్క‌డి నుంచే అమ‌రావ‌తి ద‌శ- దిశ రూప‌క‌ల్ప‌న జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ అమ‌రావ‌తి అంటే నీట మునిగే న‌గ‌రం అన్న వైసీపీ ట్రోలింగులు చూసే ఉంటాం. దీన్ని క్వాంటం వాలీ అన‌డం క‌న్నా ఆక్వా వాలీ అనొచ్చు, ఆపై పుల‌స కూడా ఇక్క‌డ దొరికే చాన్సుందన్న వ్యంగ్యాస్త్రాల సంగ‌తి స‌రే స‌రి. ఈ క్ర‌మంలో ఇక్క‌డొక పాల‌నా భ‌వ‌నం ప్రారంభం కావ‌డం అన్న‌ది అమ‌రావ‌తి అభివృద్ధికే ఒక దిక్సూచిలాంటిది. అలాంటి భ‌వ‌న ప్రారంభోత్స‌వ‌ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ మాత్ర‌మే కాదు.. కూట‌మిలో మ‌రో పార్టీ అయిన బీజేపీ సైతం అస్స‌లు రాలేదు. వీరికి ఆహ్వానం లేదా? లేక వారే లైట్ తీస్కున్నారా? అన్నది తెలీడం లేదు. అదేమంటే స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత ఫోటో ఒక‌టి ప‌ట్టుకుని యువ‌త ఉచితాలు అడ‌గ‌టం లేద‌ని.. వారి ప్ర‌తిభా పాట‌వాలు వెలికి తీయాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్న కోణంలో ఒక ట్వీట్ చేయ‌డంతో ఇప్పుడ‌ది వైర‌ల్ అయ్యింది.  మ‌రి కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డానికి ఇన్నేసి ఉచిత హామీలు ఎందుకిచ్చిన‌ట్టు?   తానే స్వ‌యంగా నియోజ‌క‌వ‌ర్గానికి 500 మంది చొప్పున ఎంపిక చేసి 10 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తామ‌న్నారు? దాని సంగ‌తేంటి? అన్న చ‌ర్చ‌కు తెర‌లేపారు ప‌వ‌న్.  వైర‌ల్ ఫీవ‌ర్ ఇంకా ఉంద‌ని హైద‌రాబాద్ లో ప‌డి ఉండ‌క‌, ఈ వైర‌ల్ కంటెంట్ రైజ్ చేయ‌డం దేనికీ? అన్న‌ది కూట‌మిలోని ప్ర‌ధాన పార్టీకి చెందిన టీడీపీ నాయ‌కులు అంటోన్న మాట‌. దానికి తోడు  కూట‌మికే బీట‌లు వారేలాంటి వినుత కోట‌- సుధీర్ రెడ్డి వ్య‌వహారం ఒక‌టి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ప‌ట్టి పీడిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ కోణంలోగానీ ఆయ‌న సీఆర్డీఏ భ‌వ‌న ప్రారంభోత్స‌వానికి రాలేద‌నుకోవాలా? ఒక వేళ ప‌వ‌న్ గానీ ఈ సెర్మ‌నీకి వ‌చ్చి ఉంటే, జన సైనికులు ప‌లు ర‌కాల కామెంట్లకు తెర‌లేపుతార‌న్న భ‌యం కొద్దీ ఈ కార్య‌క్ర‌మానికి దూరంగా ఉన్నార‌నుకోవాలా!? అది స‌రే.. ప‌వ‌న్ కంటే ఇటు ప‌ర్స‌న‌ల్ ప్రాబ్ల‌మ్స్ అటు పార్టీ ప్రాబ్ల‌మ్స్ చాలానే. మ‌రి బీజేపీ ఎందుకు మిస్ అయిన‌ట్టు? అస‌లు కూట‌మిలో ఈ మూడు పార్టీల సంబంధాలూ స‌వ్యంగానే ఉంటున్నాయా?  వీరి మ‌ధ్య పొర‌ప‌చ్చాలేం లేవు క‌దా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. మిథున్ రెడ్డి విష‌యంలో బీజేపీ చూపిస్తున్న సానుకూల వైఖ‌రి కార‌ణంగా  ఈ ఎడబాటు ఏర్ప‌డిందా? కూట‌మి పార్టీల్లో అస‌లేం జ‌రుగుతోంది? అన్న వాడి వేడి చ‌ర్చ‌కు తెర‌లేచింది.