Read more!

వైకాపా తరపున సమంత ప్రచారం?

 

ఇంతవరకు సరైన సినీ తారలెవరూ జగన్ పార్టీలో చేరలేదు. కనీసం ఆ పార్టీకి మద్దతు ఇస్తామనైనా ముందుకు రావడంలేదు. కారణాలు అందరికీ తెలిసినవే. కానీ, తెలుగు సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపేస్తున్న అందాల సమంత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనేందుకు అంగీకరించిందని తాజా సమాచారం. వైకాపా తరపున పోటీ చేస్తున్నకోన రఘుపతి కుమార్తె కోన నీరజ ఆమె వ్యక్తిగత దుస్తుల డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఆమె కోరిక మేరకు సమంత రఘుపతి తరపున ఆయన పోటీ చేస్తున్న నియోజక వర్గంలో ప్రచారంలో పాల్గొనేందుకు అంగీకరించినట్లు తాజా సమాచారం. అందుకు ఆమెకు భారీ మొత్తం కూడా ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ సమంత ప్రచారానికి మంచి స్పందన వచ్చినట్లయితే ఆమెచేత మరికొన్ని నియోజక వర్గాలలో కూడా వైకాపా ప్రచారం చేయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమాచారాన్ని సమంత కానీ వైకాపా గానీ అధికారికంగా ఇంకా ద్రువీకరించవలసి ఉంది. ఒకవేళ వైకాపా తరపున సమంతను రంగంలో దింపినట్లయితే, అప్పుడు తెదేపా కూడా ఏ కాజల్ అగర్వాల్ నో మరొక తారనో రంగంలో దింపినా ఆశ్చర్యం లేదు. అయితే తెలుగులో నాలుగు ముక్కలు తడుముకోకుండా మాట్లాడటం చేతకాని ఇటువంటి తారలు ప్రచారానికి వచ్చి ఏమి మాట్లాడుతారు? వారి వలన పార్టీలకి ఏమి ప్రయోజనం ఉంటుంది?