Read more!

జగన్ ను టార్గెట్ చేసిన ఆరడుగుల బుల్లెట్ ?

 

జగన్.. పేరులో గన్ ఉంది కానీ.. బుల్లెట్ మాత్రం ఇన్ డైరెక్ట్ గా వచ్చి జ"గన్"నే తాకింది. విశాఖపట్నం బహిరంగసభలో పవన్ కళ్యాన్.. జగన్ లక్ష్యంగా విమర్షలు గుప్పించారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే ఎవరి పేరు ప్రస్తావించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు పవర్ స్టార్. వేల కోట్లు అవినీతి చేసాడని అరెస్ట్ చేయిస్తారు, దర్యాప్తులు వేయిస్తారు, ఒప్పందం కుదరగానే బెయిల్ ఇప్పిస్తారు. ఇదెక్కడి న్యాయం. తమ మాట వినకపోతే నిందితుడు.. మాట వింటే మంచివాడు..ఇదేనా కాంగ్రెస్ నీతి.. అంటూ జగన్ పేరు ఎత్తకుండానే అక్రమాస్తుల కేసు, తదనంతరం జరిగిన పరిణామాలను వివరించారు. నిజాయితీగా ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారికి 9 నెలలు పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. పవన్ ఏ ఒక్కరి పేరు నేరుగా చెప్పకపోయినా .. జగన్, కాంగ్రెస్ పార్టీ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురింఛి నర్మగర్భంగా ప్రస్తావించారని అభిమానులు ఊహించుకుంటున్నారు.