యాబై కోట్ల హీరోయిన్
posted on Oct 2, 2013 @ 10:57AM
ఇన్నాళ్లు బాలీవుడ్లో మాత్రమే కలెక్షన్ స్టామినాతో హీరోయిన్ ఇమేజ్ లెక్కగట్టిన ఆడియన్స్ ఇప్పుడు టాలీవుడ్లో కూడా అదే ట్రెండ్ కు తెరతీశారు.. తెలుగు సినిమాల్లో కూడా భారీ కలెక్షన్లు కురిపిస్తున్న హీరోయిన్లకే సక్సెస్ పట్టం కడుతున్నారు.. అయితే ఈ లిస్ట్ అగ్రస్ధానంలో నిలిచిందో అందాల భామ.
బాలీవుడ్ హీరోయిన్ స్టామినాను వందకోట్ల కలెక్షన్లతో లెక్కగడతారు.. ఇప్పటికే కరీనా, విద్యాబాలన్, దీపకా పదుకునే, కత్రినా లాంటి అందాల భామలు ఈ వంద కోట్ల క్లబ్లో చేరి టాప్ హీరోయిన్స్ అనిపించుకున్నారు. అయితే హీరోయిన్ల విషయంలో కూడా ఈ కలెక్షన్ల ఫీవర్ ఇప్పుడు టాలీవుడ్కి కూడా పాకింది.. ఇంతకు ముందెన్నుడ లేని విధంగా ఇప్పుడు ఏ హీరోయిన్ నటించిన సినిమాలు ఎంతెంత కలెక్ట్ చేస్తున్నాయి అని చర్చించుకుంటున్నారు ట్రేడ్ వర్గాలు..
అయితే ఇలా కలెక్షన్ల లిస్ట్లో టాప్ ప్లేస్ దక్కించుకుంది అందాల భామ సమంత.. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాసులు కురిపించడంలోనూ ముందే ఉంటుంది..సమంత హీరోయిన్గా నటించిన నాలుగు సినిమాలు వరుసగా 50 కోట్ల క్లబ్లో చేరాయి.. దీంతో ఈ అమ్మడి క్రేజ్ ఇప్పుడు మరింతగా పెరిగిపోయింది. సమంత హీరోయిన్గా నటించిన దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు భారీ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేశాయి..
అయితే ఇప్పుడు తాజాగా సమంత హీరోయిన్గా నటించిన అత్తారింటికి దారేది కూడా 50 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకు పోతుంది. అయితే తన గత సినిమాల కంటే అత్తారింటికి దారేది సినిమాతో ఇంకా షార్ట్ టైంలోనే 50 కోట్లు కలెక్ట్ చేసి మరో రికార్డ్ సెట్ చేయబోతుంది సమంత..