కొరివితో తలగోక్కుంటున్న కమల్ హాసన్
posted on Oct 2, 2013 @ 11:25AM
విశ్వరూపం సినిమాను మరోసారి వివాదాలు చుట్టుము్టేలా ఉన్నాయి. తొలి భాగంతో వివాదాస్పదమైనా మంచి సక్సెస్ అందుకున్న కమల్ హాసన్ ఇప్పుడు మరోసారి పాత వివాదానికే తెరతీసే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా విశ్వరూపం 2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వరూపం.. అత్యంత వివాదాస్పద మైన ఇండియన్ సినిమాల్లో ఒకటి.. ఉగ్రవాదం నేపధ్యంలో కమల్ స్వీయదర్శకత్వంలో నటించి, నిర్మించిన ఈ సినిమా ఆది నుంచి వివాదాలతోనే మొదలైంది..
తొలి భాగం సినిమా రిలీజ్కు ముందే డిటిహెచ్లో రిలీజ్ చేయాలని భావించిన కమల్.. ఆ ఆలోచనతో వివాదాల్లో ఇరక్కొని కంటనీరు కూడా పెట్టుకున్నాడు.. సినిమా విడుదల చేయనివ్వకపోతే దేశం విడిచివెళ్లిపోతానని కూడా ప్రకటించాడు.. అయితే తమిళ సినీ ప్రముఖుల జోక్యంతో వివాదం సద్దుమనిగింది.. కమల్ డిటిహెచ్లో సినిమా విడుదల చేయాలన్న ఆలోచన విరమించుకోవడంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు ఆందోళన విరమించారు..
అయితే ఇప్పుడు మరోసారి డిటిహెచ్ వివాదాన్ని తెరమీదకు తీసుకువచ్చాడు కమల్.. విశ్వరూపం పార్ట్ 2ను కూడా డిటిహెచ్లో విడుదల చేయడానికి సిద్దమవుతున్నట్టుగా ఇండస్ట్రీల వర్గాల సమాచారం. అదే గనుక నిజమైతే కమల్ హాసన్ మరోసారి కొరివి తలగొక్కున్నట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు.. ఒకసారి అదే ప్రయత్నం చేసి విరమించుకున్న తిరిగి ప్రయత్నం చేసి నవ్వుల పాలు కావటం కన్నా మామూలుగా సినిమా రిలీజ్ చేయటమే బెటర్ అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు..
మరి కమల్ విశ్వరూపం2తో తన పంతం నెగ్గించుకుంటాడా, లేక మరోసారి వెనకడుగు వేస్తారా అన్నది తెలియాలంటే మాత్రం ఈ డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే..