ప్రమాదంలో మగధీర రికార్డ్స్
posted on Oct 2, 2013 @ 10:47AM
టాలీవుడ్‌లో ఇంకే సినిమా బీట్ చేయలేదు అనుకున్న ఓ భారీ రికార్డ్‌కు ఇప్పుడు ప్రమాదం ఏర్పాడింది. అది కూడా బయటి సినిమా నుంచి తన ఇంటి హీరో నుంచి వచ్చిన సినిమాతోనే.
టాలీవుడ్‌లో చరిత్రను తిరగరాసిని బిగెస్ట్ హిట్ మగధీర.. 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇదే పెద్ద హిట్.. మెగా తనయుడు రామ్‌చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంభినేషన్లో వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాదించటంతో పాటు అన్‌బిటబుల్ రికార్డులను సెట్ చేసింది..
అయితే ఇప్పుడు ఈ మగధీరుడి రికార్డులకు ప్రమాదం వచ్చింది. అది కూడా బయట హీరోల సినిమాలతో కాదు.. సొంత బాబాయితోనే.. పవన్ కళ్యాన్ హీరోగా ఇటీవల విడుదలైన అత్తారింటికి దారేది సినిమా పాత రికార్డులను తిరగరాసే దిశగా నడుస్తుంది..
ఇప్పటికే గబ్బర్‌సింగ్ సినిమాతో మగధీరుడికి చెమటలు పట్టించిన పవర్‌స్టార్ ఈ సారి తప్పకుండా పాత రికార్డులను బద్దలు కొడాతంటున్నారు ఫ్యాన్స్. పవన్ పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో పాటు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ డైరెక్షన్తో అత్తారింటికి దారేది సెన్సెషన్ క్రియేట్ చేస్తుంది.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో సినిమా చాలా సార్లు వాయిదా పడటం, రిలీజ్కు ముందే ఫస్ట్ ఆఫ్ సినిమా అంతా పైరసి కావడంతో అసలు ఆడటమే కష్టం అనుకున్న అత్తారింటికి దారేది.. ఇప్పుడు రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే భారీగా కాసులు కురిపిస్తున్న అత్తారింటికి దారేదికి మరో పదిరోజుల పాటు వేరే సినిమా లేకపోవడంతో.. మరి కొద్ది రోజుల పాటు కాసుల వర్షం కురుస్తుందంటున్నారు విశ్లేషకులు. ఇది ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లో మగధీర రికార్డులు బ్రేక్ అవుతాయింటున్నారు పవన్ ఫ్యాన్స్..