అంతా కేసీఆర్ ఆత్రమే తప్ప, అటు నుంచి ఏమీ లేదు!
posted on May 18, 2024 @ 3:56PM
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలవాలని, ఏపీ ఇంకా సర్వనాశనం అయిపోవాలని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లస్ ఆయన కుటుంబం కోరుకుంటూ వుంటారు. ఆ దిక్కుమాలిన కోరికేదో తమ మనసులోనే ఉంచుకోకుండా, ఎవరు అడిగినా ఏపీలో జగన్ గెలుస్తాడు అని సంబరపడిపోతూ చెబుతూ వుంటారు. జగన్ గెలవాలని వీళ్ళు మురిసిపోతూ కోరుకోవడమే తప్ప జగన్ గానీ, ఆయన పార్టీ వర్గీయులు గానీ, జగన్ మీడియా గానీ కేసీఆర్ విషయంలో ఎలాంటి ప్రేమాభిమానాలూ ప్రదర్శించడంలేదు. సాధారణంగా ఎక్కడైనా జరిగేది ఏమిటంటే... నేను నిన్ను పొగుడుతా.. నువ్వు నన్ను పొగుడు అనే స్కీమ్. ఈ స్కీమ్ ప్రకారం ఏపీలో జగన్ గెలుస్తాడు అని కేసీఆర్ కుటుంబం పదేపదే చెబుతున్నప్పడు, తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు అని వైసీపీ వాళ్ళు ఒక్కరైనా చెప్పి చెల్లుకు చెల్లు చేసుకోవాలి కదా. అలాంటిదేమీ వైసీపీ వాళ్ళవైపు నుంచి లేదు. నువ్వు మా చెక్క భజన చేసుకుంటే చేసుకో.. మేం నీ ముఖం కూడా చూడం నువ్వు ఎలా చస్తే మాకేంటి అన్నట్టుగానే వాళ్ళ ధోరణి వుంది. మొన్నామధ్య ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వన్ టైమ్ బెన్‌ఫిట్ లాగా జగన్ ప్రభుత్వం నాగార్జున సాగర్ మీదకి ఏపీ పోలీసులను పంపి, తెలంగాణ ప్రజలను కేసీఆర్‌కి అనుకూలంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ, అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ అదరగొట్టేస్తాడు అని వైపీపీ వాళ్ళెవరూ చెప్పిన పాపన పోలేదు. అలా చెప్పకపోతే పోయారు.. కనీసం నెగటివ్‌గా అయినా చెప్పకుండా వుండొచ్చు కదా.. కానీ, ఆ దారుణం జరిగిపోయింది.
వైసీపీ ఆస్థాన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి టీవీలో కొంతసేపు తన సుత్తి కొడుతూ వుంటారు. ‘జగన్ సాక్షాత్తూ దేవుడు’ అనే మాట అనరు తప్ప, ఆయన చేసే జగన్ భజన ఆ రేంజ్‌లోనే వుంటుంది. అలాంటి ఆయన శనివారం నాడు తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి మీద సుదీర్ఘ సుత్తి కొట్టారు. అటు తిప్పీ ఇటు తిప్పీ ఆయన తేల్చింది ఏమిటంటే, పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్‌కి అంత సీన్ లేదు. అసలు పోటీ అంతా కాంగ్రెస్, బీజేపీ మధ్యలో వుంది. కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ ఆటలో అరటిపండ్ల మాదిరిగా మిగిలిపోయారు. ఈ ఐదేళ్ళూ కేసీఆర్ జనంలో వుండి, జనం నమ్మకాన్ని గెలుచుకుంటే తప్ప వచ్చే ఎన్నికలకు మిగులతారు. లేకపోతే అడ్రస్ లేకుండా పోతారు. సర్వనాశనం అయిపోతారు... అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఖర్మరా బాబూ.... పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!