చివరాఖరికి సజ్జల కూడా వైసీపీ ఓటమి ఖాయమని తేల్చేశారుగా?

వైసీపీ ఓటమి ఖరారని తెలుగుదేశం కూటమి నేతలు, పరిశీలకులు, రాజకీయ పండితులు చెప్పడం కాదు. స్వయంగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డే అంగీకరించేశారు. ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం కంఫర్ట్ బుల్ గా విజయం సాధించబోతోందని ఆయన అన్యాపదేశంగా కేడర్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు.

అదే సమయంలో గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తామన్న జగన్ రెడ్డి మాటలు అబద్ధమని కూడా తేల్చేశారు. పోలింగ్ జరిగిన నాటి నుంచి చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేశారు. పోలిసులు పూర్తిగా తెలుగుదేశంతో కుమ్మక్కైపోయారు. నిజాయితీగా పని చేసే అధికారులను మార్చేశారు అంటే శోకన్నాలు పెట్టిన సజ్జల ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చి మాచర్లలో ఈవీఎం ధ్వంసమైనా తెలుగుదేశం రీపోలింగ్ కోసం ఎందుకు డిమాండ్ చేయడం లేదంటూ ప్రశ్నలు గుప్పించారు. రీపోలింగ్ డిమాండ్ చేయలేదంటే అక్కడ  తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా పోలింగ్ జరిగినట్లే కదా అని ఆయనే జవాబు కూడా చెప్పేశారు.

సాధారణంగా విజయం సాధిస్తామని నమ్మకం ఉన్నపార్టీ రీపోలింగ్ కోసం డిమాండ్ చేయదు. అదే fవిాషయాన్ని సజ్జల చెప్పారు. అక్కడితో ఆగకుండా ఆయన చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నానని భావిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు వ్యూహాల ముందు ఎవరూ పనికిరారని అన్యాపదేశంగా అంగీకరించేశారు. ఎవరైనా సరే చంద్రబాబు మాట వినాల్సిందేనని చెప్పారు. చివరాఖరికి మోడీ కూడా చంద్రబాబు ట్యూన్ కు డ్యాన్స్ చేయాల్సిందేనని సజ్జల అన్నారు.

వాస్తవానికి సజ్జల   చెబుదామనుకున్నారంటే.. చంద్రబాబు పోల్ మేనేజ్ మెంట్ ద్వారా పోలింగ్ మొత్తం  తెలుగుదేశం కూటమికి అనుకూలంగా మారిపోయిందనీ, అందుకకు బీజేపీ సహకరించిందనీ చెప్పేశారు. అలా చెప్పడం ద్వారా ఆయన చంద్రబాబును పొగడడమే కాకుండా వైసీపీ ఓటమిని కూడా అంగీకరించేశారు. ఇక ఇప్పటి వరకూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ క్యాడర్  జారిపోకుండా ఉండేందుకు వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు,  ఇచ్చిన హైప్ అన్నీ వ్యర్థంగా మారిపోయాయి.

Teluguone gnews banner