డెన్మార్క్ ఫైనల్లో చెలరేగిన సైనా
posted on Oct 22, 2012 @ 11:42AM
డెన్మార్క్ ఓపెన్ ఫైనల్లో సైనా నెహ్వాల్ చెలరేగిపోయింది. ఈ ఏడాదిలో నాలుగో టైటిల్ సొంతంచేసుకుంది. మూడోసీడ్ సైనా 21-17, 21- 8తో డెన్మార్క్‌కు చెందిన ఆరోసీడ్ జూలియన్ షెంక్‌ను వరుస గేముల్లో చిత్తుచేసి విజేతగా నిలిచింది. ఈ విజయంతో రూ.16.15 లక్షల ప్రైజ్‌మనీని సైనా దక్కించుకుంది. 35 నిమిషాల్లోనే ముగిసిన ఈ ఏకపక్ష పోరులో తన ట్రేడ్‌మార్క్ క్రాస్ కోర్టు షాట్లు, స్మాష్‌లు, క్లియర్ విన్నర్లతో షెంక్‌ను షేక్ చేసింది. తొలిగేమ్‌లో కొద్దిగా ప్రతిఘటించిన షెంక్ రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. పదే పదే తప్పులు చేయడంతో సైనా ముందంజ వేసింది. షెంక్‌కు తేరుకునే అవకాశమివ్వకుండా విజయం దిశగా దూసుకెళ్లింది.