శబరిమల ఆవరణ పంపిణీ నిలిపివేత!

ఆలయాలలో ప్రసాదాల తయారీ, పంపిణీ, నాణ్యత, పవిత్రత విషయంలో ఇటీవలి కాలంలో వివాదాలు పెచ్చరిల్లుతున్నాయి. 
రెండు నెలల కిందట విజయవాడ దుర్గగుడిలో శానిటేషన్ శాఖలో పని చేసే ఉద్యోగి.. ప్రసాదం లడ్డూలపై కూర్చుని ఫోన్ మాట్లాడుతూ.. ఇదేమని ప్రశ్నించిన భక్తులపై ఎదురు దాడికి దిగాడు. వాళ్లెంత అభ్యంతర పెట్టినా నా ఇష్టం నాదే అన్నట్లు వ్యవహరించాడు. దీంతో కొందరు భక్తులు ఆ ఉద్యోగి లడ్డూల పై కూర్చుని ఫోన్ మాట్లాడుతుండగా ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.

అలాగే.. ఇటీవల భద్రచాలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో భక్తులకు బూజు పట్టిన లడ్డూలు విక్రయించిన సంఘటన మరువక ముందే.. శబరిమలలో ప్రసాదాల పంపిణీని నిలిపివేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఆవరణగా పిలిచే ఈ ప్రసాదం తయారీలో యాలకులు ఉపయోగిస్తారు. అయితే ఈ యాలకులను అధిక మొత్తంలో రసాయినాలు వాడి పండిస్తున్నట్లు తేలింది.

దీంతో ఈ ప్రసాదం తినే వారికి హానికరమని భావించిన కేరళ హైకోర్టు ఆవరణ పంపిణీ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు యాలకులు వాడకుండా ప్రసాదం తయారు చేయాలని నిర్ణయించింది.  మొత్తం మీద వరుస సంఘటనలు చూస్తుంటే.. భక్తులు అత్యంత భక్తితో వచ్చే దేవాలయాల పవిత్రత, పరిశుభ్రత, ప్రసాద నాణ్యత వంటి విషయాలలో సంబంధిత అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Teluguone gnews banner