చైనాకు రష్యా రిటర్న్ గిఫ్ట్!
posted on Apr 16, 2020 @ 12:32PM
* ఇతర దేశాలకు అంటించిన వైరస్, తిరిగి పుట్టింటికి చేరిన వైనం
* అంటించిన వారి వివరాలు వెల్లడిస్తే, నగదు బహుమతి ఇస్తామంటూ ఆశ చూపిన చైనా
*మహా భారతం అరణ్యపర్వం లో 'ఈ బాపతు అడ్డగోలు జాతి' గురించి ముందే హెచ్చరించిన భీష్మ పితామహుడు
* ఇతరులకు మనం చేసేది మనకు గ్యారంటీ గా వాపస్ వస్తుందని చైనా గుర్తిస్తే మేలు
ఒరులేయని యొనరించిన
నరవర! యప్రియము దన మనంబున కగు దా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్.
మహాభారతం లోని అరణ్యపర్వం లోని పంచమాశ్వాసం లో ---ప్రబంధ పరమేశ్వరుడు ఎఱ్ఱాప్రగడ రాసిన ఈ పద్యం పూర్వ రంగం ఏమిటంటే- పాండవ ప్రథముడైన ధర్మరాజు, ఉత్తమమైన ధర్మం ఏది అని తన సందేహం తీర్చుకోవడానికి భీష్మ పితామహుడి వద్దకు వెళ్లిన సందర్భంలో, ఆ మహానుభావుడు -ధర్మరాజు కు చెప్పిన ధర్మ సూత్రమే ఇది. దీని భావమేమిటంటే, ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరుల విషయంలో చేయగూడదు. అదే ధర్మం. కానీ, చైనా వాళ్ళు మహా భారతం చదివి ఉండరు కదా.. అందుకని వాళ్లకు, ఈ ధర్మం సంగతి తెలియక, తాము చేయగలిగినంత అపకారాన్ని -కరోనా వైరస్ రూపంలో అన్ని దేశాలకూ చేసేశారు. అయితే, ప్రకృతి చాలా గొప్పది కదా... భీష్ముడు చెప్పిన ఫార్ములా ను తూచా తప్పకుండా పాటిస్తూ, చైనా కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం మొదలెట్టేసింది. అది కూడా ఎలాగంటే, రష్యా నుంచి వస్తున్న వారితో చైనా లో మళ్లీ కేసులు మొదలు కావటం ద్వారా.. అంతే కాదు, వివిధ దేశాల నుంచి చైనాలోకి చొరబాట్లు జరిగిన కారణంగా తేలిన లెక్కలేమిటంటే, రష్యా నుంచి వచ్చిన వారిలో 79 మందికి కరోనా ఉందని తేలటం.
ఆచూకీ చెబితే 5 వేల యువాన్ల నజరానా ఇస్తామనే దౌర్భాగ్య స్థితికి చైనా చేరుకున్నదంటే, చైనా చేసిన దురాగతం ఎలా కొత్త రూపం తీసుకుని ఆ దేశాన్నే కబళించటానికి వెనక్కు రావటం. వివిధ దేశాల నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న వారి కారణంగా మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. వారి వివరాలు అందిస్తే నజరానా అందిస్తామని ప్రకటించింది.
దేశంలోని ఈశాన్య ప్రాంతమైన హిలోంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోకి రష్యా నుంచి వచ్చిన వారిలో మంగళవారం కొత్తగా 79 కేసులు నమోదయ్యాయి. కేసుల నమోదుతో ఉలిక్కిపడిన అధికారులు వాటికి అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దు వద్ద నిఘా పెంచారు. అయినప్పటికీ చొరబాట్లు ఆగకపోవడంతో అటువంటి వారి ఆచూకీ చెబితే ఒక్కొక్కరికీ 5 వేల యువాన్లు (రూ.54 వేలు) చొప్పున ఇస్తామని అధికారులు ప్రకటించారు. దేశంలోకి ప్రవేశించే వారిని పట్టుకుని పరీక్షలు చేస్తే పరిస్థితి మళ్లీ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. కనీసం, ఇప్పటికైనా మహా భారతం చదివి, అందులో భీష్ముడు చెప్పిన ధర్మ సూత్రాలు ప్రాక్టీస్ చేస్తే, భవిష్యత్తులోనైనా కాస్త మానసిక సంస్కరణ జరిగే అవకాశముంది.