ఆగస్టు 15న పోలీసుల ఆంక్షలు
posted on Aug 13, 2012 @ 9:58AM
హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కమీషనర్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ నగరంలో ఆంక్షలు విధించారు. పెరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలలో కెమెరాలు, సెల్ ఫోన్ లు అనుమతించబోమని తెలిపారు. పెరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. సుమారు 1200 మంది పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.