డ్రగ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్!
posted on Sep 13, 2021 @ 2:08PM
టాలీవుడ్ లో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. 2017లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో.. అప్పుడు విచారణ పేరుతో హడావుడి చేసిన తెలంగాణ సర్కార్... తర్వాత కేసు విచారణను అర్ధాంతరంగా నిలిపివేసింది. సినిమా తారలకు క్లీన్ చిట్ ఇస్తూ 2020 చివరలో కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసింది. డ్రగ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఈడీ రంగంలోకి డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతోంది. 2017లో విచారణకు హాజరైన డైరెక్టర్ పూరి జగన్నథ్, హీరోయిన్ చార్మి, హీరో నవదీప్ , నందుతో పాటు గతంలో విచారణకు హాజరుకాని రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానాను కూడా ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న ఈడీ విచారణలో ఏం తేలుతుందన్న దానిపై ఆసక్తి కొనసాగుతోంది. ఈ సమయంలోనే డ్రగ్స్ వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
సైదాబాద్ సింగరేణి కాలనీ లో హత్యాచారం కు గురయైన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.టీఆర్ఎస్ ప్రభుత్వం నీచంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బలిసినోడికి ఓ న్యాయం చేస్తున్నారు, గిరిజనులకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. ఈ ఘటన పై ఇప్పటికి మంత్రులు స్పందించకపోవడం దారుణమన్నారు. గంజాయ్ మత్తులో ఒక దుర్మార్గుడు చిన్నారిని హత్యచారం చేస్తే.. నిందితుడిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదన్నారు.ప్రభుత్వం లో ఉన్నవారు మనుషులేనా.. మానవత్వం ఉందా అని రేవంత్ ప్రశ్నించారు. దిశ సంఘటన జరిగినపుడు ఎదయితే చేశారో.. ఇప్పుడు కూడా నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దిశ సంఘటనలో ఒక న్యాయం గిరిజనులపై జరిగేతే ఒక న్యాయమా అని ఆయన నిలదీశారు. ప్రభుత్వం చిన్నారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని.. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కమిషనర్ చవట దద్దమ్మ.. కమిషనర్ కు కామన్ సెన్స్ లేదు...కళ్ళు కంపౌండ్ దగ్గర పని చేయడానికి పనికి రాడని మండిపడ్డారు పీసీసీ చీఫ్. సింగరేణి కాలనీలో గంజాయ్ నడుస్తున్న పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్ బ్రాడ్ అంబాసిడర్ గా మంత్రి కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. మద్యానికి బ్రాడ్ అంబాసిడర్ గా కెసిఆర్ ఉన్నాడంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం ఆదాయం పెరగడానికి మద్యం అమ్మకాలు చేస్తున్నారని విమర్శించారు. మద్యం ,గంజాయ్ అమ్మకాలతోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి. హోంమంత్రి మంత్రికి సిగ్గు లేదు.. పక్కన హత్య చారం జరిగితే ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. ఇక్కడ పోలీసుల వైఫల్యం కనిపిస్తుందన్న రేవంత్.. ఘటనకు నిరసనగా ధర్నా చేసిన యువకుల మీద దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.