ముస్లిం దేశంలో ప్రపంచంలో అతిపెద్ద వినాయకుడి విగ్రహం..
posted on Sep 13, 2021 @ 2:48PM
విదేశాల్లో విగ్రహాలు లేదా అతిపెద్ద టవర్లు అంటే మనకు గుర్తుకొచ్చేవి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, పీసా టవర్ లాంటి అతి కొద్ది మాత్రమే. కానీ ప్రపంచంలో అతి భారీ సైజు వినాయక విగ్రహం కలిగిన దేశం కూడా ఉంది. అదే థాయిలాండ్. కేవలం ఒక్క విగ్రహమే కాదు.. ఇక్కడ వినాయకుడికి మూడు విగ్రహాలున్నాయి. అన్నీ కూడా చాలా పెద్ద సైజువే కావడం విశేషం. ఈ గణేశ్ నవరాత్రుల సందర్భంగా థాయిలాండ్ లోని అతి భారీ సైజు వినాయక విగ్రహం విశేషాలు చూడండి.
ప్రపంచంలో అతిపెద్ద వినాయకుడి కాంస్య విగ్రహాన్ని థాయిల్యాండ్ లో ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం చూడటానికి ప్రపంచ పర్యాటకులంతా ఇష్టపడతారు. చాచొంగ్సావ్ ప్రావిన్స్ లోని క్లాంగ్ ఖ్యాన్ లో ఈ విగ్రహాలున్నాయి. సోంసావలీ ఫ్రవర రజతినుద్దమత్ అనే థాయి రాజు హయాంలో దీన్ని నిర్మించారట. 39 మీటర్ల ఎత్తులో పూర్తి కాంస్యంతో నిర్మించడం ఈ వినాయకుడి మరో ప్రత్యేకత. 39 మీటర్లు అంటే దాదాపు 150 అడుగుల విగ్రహం అన్నమాట.
థాయిలాండ్ ముస్లిం కంట్రీ అయినా కూడా అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు తమ మూలాలను మాత్రం మరచిపోలేదు. మూలాలను అంటిపెట్టుకునే ఉన్నారు కాబట్టే.. వాటిని జీవితంలో భాగం చేసుకున్నారు కాబట్టే... ఆ దేశానికి టూరిజం ద్వారా పెద్దమొత్తంలో ఆదాయం లభిస్తోంది. కాలక్రమంలో వారు ఇస్లాంనే పాటిస్తున్నా.. అంతకు పూర్వం ఉన్న వారసత్వ వైభవాన్ని మాత్రం ప్రత్యేకంగా ఆదరిస్తున్నారు. వేదకాలం, ఆ తరువాతి కాలంలో భారతదేశాన్ని భరతఖండం అని పిలిచేవారు. సంస్కృతీ, సంప్రదాయాలు, మేధో వలసలు అన్నీ భారత్ నుంచే జరిగాయి. భారత్ నుంచి వెళ్లిన అనేక తరాల ప్రజలు తమ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారు. ముఖ్యంగా ఆసియా ఖండమంతటా హిందూ సంస్కృతి వ్యాపించడానికి ఇదే కారణమంటారు.
ఇక థాయిల్యాండ్ లో గణేశ్ ఉత్సవాల సందర్భంగా 39 అడుగులు కాంస్య విగ్రహాన్ని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుండడం విశేషం. అక్కడ బౌద్ధులు ఎక్కువగా ఉన్నా.. వారంతా హిందూ ట్రెడిషన్ నే ఎక్కువగా ఫాలో అవుతుంటారు. గణేశ్ ఉత్సవాలను బౌద్ధులు కూడా ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఇక్కడ గణేశుణ్ని ఫ్ర ఫికానె (శ్రీ గణేశ్) అని థాయి భాషలో పిలుస్తారు. హిందువులు తమ అన్ని కార్యాల్లో విఘ్నం కలగకుండా చూడాలని, విజయం కలిగించాలని వినాయకుణ్ని ఎలాగైతే వేడుకుంటారో బౌద్ధులు కూడా అదే తరహాలో వినాయకుణ్ని పూజించడం విశేషం. కొత్త వ్యాపారాలు ప్రారంభించినప్పుడు, నూతన కార్యక్రమాలు తలపెట్టినప్పుడు, పెళ్లిళ్ల లాంటి శుభకార్యాల్లో అక్కడి బౌద్ధులు వినాయకుణ్నే ఆరాధిస్తారు. థాయిల్యాండ్ లో ఉన్న మూడు పెద్దసైజు వినాయకులను దర్శించేందుకు నవరాత్రుల టైమ్ లో పెద్దఎత్తున పర్యాటకులు క్యూ కడతారు.
ఇక హిందూ మెజారిటీ గల ఇండియాలో ఎవరైనా వినాయకుడికి ఇంత భారీ ప్రయారిటీ ఇస్తే మాత్రం విమర్శించడానికి కొన్ని వర్గాల ప్రజలు మాత్రం రెడీగా ఉంటారు.