జగన్ రెడ్డిని కుమ్మేసిన రేవంత్ రెడ్డి..
posted on Jul 1, 2021 @ 7:59PM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి చీఫ్ గా నియమితులైన ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు మరింత పెంచారు. మాములుగానే ఫైర్ బ్రాండ్ లీడర్ గా పంచ్ డైలాగులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ గా ఎంపికయ్యాక మరింత స్పీడ్ పెంచారు. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. రోజుకో బాంబ్ పేల్చుతూ రాజకీయ కాక రేపుతున్నారు. రేవంత్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో, ఎవరిని టార్గెట్ చేస్తారో అన్న ఆసక్తి జనాల్లో కనిపిస్తోంది. ఇక ప్రత్యర్థి పార్టీల నేతలైతే రేవంత్ తనను టార్గెట్ చేస్తారమోనన్న భయంతో వణికిపోతున్నారని చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల వివాదంపై తన దైన శైలిలో స్పందించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు నీళ్ళు సంస్కృతి... కానీ అవే నీళ్లు కేసీఆర్ కు ఏటీఎం గా మారాయని ఆరోపించారు.పరివాహక ప్రాంతాలకు నీళ్లు ఇవ్వకుండా ...ఇతర ప్రాంతాలకు నీళ్లు తరలించడం సహాజ సూత్రాలకు విరుద్దమన్నారు. రెండు ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి ఇరు వర్గాలు లబ్ది పొందుతున్నారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 11టీఏంసీల నీరు జగన్ ప్రభుత్వం తరలించబోతుందని చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా రోజు కు 1 టీఎంసీ నీరు కు మించి తరలించలేరన్నారు.
జూరాలలో మనకు కనిపించిన నీరు...సంగంబండ తర్వాత కనపించదన్నారు రేవంత్ రెడ్డి. సంగంబండ దగ్గర జలదోపిడి జరుగుతుందని.. దీనికి ప్రధాన కారకుడు కేసీఆరే అని ఆరోపించారు. కృష్ణా నది నుండి ఏపీ ఎన్నీ నీళ్లు తీసుకోబోతుందో స్పష్టంగా అసెంబ్లీ లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. ఆ తర్వాతే ప్రగతి భవన్ లో జగన్ కు కేసీఆర్ అథితి మర్యాదలు చేశారని చెప్పారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో జగన్ సమావేశం తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జగన్ కు కేసీఆర్ అమ్ముడు పోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ లో ఉన్న ఆంధ్ర వాల్లకోసమే గట్టిగా మాట్లాడట్లేదని జగన్ అనడం హాస్యాస్పదమ్ననారు రేవంత్ రెడ్డి. తన తండ్రి ని తిడితే నోరు మెదపని వాడు ఏపీకి ఏం న్యాయం చేస్తారని సెటైర్ వేశారు.
వైఎస్ ను తిడితే...అటు జగన్ ,ఇటు విజయమ్మ ఒక్కరు కూడా నోరు మెదపలేదన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీ లకు వెళ్లిన నేతలు తిరిగి కాంగ్రెస్ వైపు రాకుండా చేసేందుకు ..వైఎస్ షర్మిల ను పావుగా వాడుతున్నారని చెప్పారు. జలవివాదాలతో లబ్ది పొందేందుకు జగన్ ,కేసీఆర్ వేసిన స్కెచ్ ఇదన్నారు. కృత్రిమ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
జులై 8 వైఎస్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ కూతురు తెలంగాణ లో పార్టీ ప్రారంబించబోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్ అంటే తెలంగాణ లో రైతులు గుర్తుకు వస్తారు.. అంతే గాని తెలంగాణ లో ఏం చేసినా చెల్లుతుంది అంటే కుదరదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ,వైఎస్ అంటే సంక్షేమం గుర్తుకు వస్తుందన్న రేవంత్ రెడ్డి.. అలాంటి వారిని తిడితే కుష్ఠురోగం వస్తుందన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రయోజనాలు ,కేటీఆర్ ఆర్థిక ప్రయోజనం వల్లే సమస్య వచ్చిందన్నారు. తెలంగాణ లో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పై పోలీసులెందుకు.. ఎవరిని రెచ్చగొట్టడం కోసమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏ సెంటిమెంట్ తో కేసీఆర్ గద్దెనెక్కాడో.. అదే సెంటిమెంట్ తో అందపాతాలానికి పోతారని రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్లు ,నిధులు ,నియామకాలు.. ఈ మూడే కేసీఆర్ ను గద్దె దించుతాయని స్పష్టం చేశారు.