మోడీతో రేవంత్ భేటీ ...అభివృద్దిపై ఫోకస్
posted on Feb 26, 2025 @ 4:30PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో బుధవారం సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరిరువురు సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్దికి దోహదపడే ఐదు అంశాలపై ఈ సమావేశంలో ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. హైద్రాబాద్ మెట్రో రైళ్ల విస్తరణకు , రంగారెడ్డి రింగ్ రోడ్డుకు మద్దత్తు పలకాలని రేవంత్ రెడ్డి ప్రధానిని కోరారు. 55 కిలో మీటర్ల దూరం వరకు విస్తరించిన మూసీ నది పునరుద్దరణకు రేవంత్ రెడ్డి ప్రధానితో చర్చించారు. తెలంగాణలో 29 ఐపిఎస్ పోప్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని వెంటనే భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రధానిని కోరారు. సెమీ కండక్టర్ పరిశ్రమ అభివృద్దికి దోహదపడాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, విభజన సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. గత పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను మోదీ రేవంత్ రెడ్డిని అడిగితెలుసుకున్నారు. ఎస్ ఎల్ బిసి ప్రమాదం గురించి మోడీ ఆరా తీశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు.