బాబోయ్ ముద్రగడ.. భయపడిపోతున్న రెడ్లు!
posted on Jun 5, 2024 @ 12:59PM
పవన్ కళ్యాణ్‌ని ఓడగొడతామని, పవన్ కళ్యాణ్ గెలిస్తే తాను తన పేరు చివర్లో ‘రెడ్డి’ అని చేర్చుకుంటానని ముద్రగడ పద్మనాభం ఎన్నికల ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తాను తన ఓటమిని అంగీకరిస్తున్నానని, తన పేరు చివర్లో ‘రెడ్డి’ అని చేర్చుకుని పేరు మార్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాపులు హమ్మయ్య మా కాపు కులానికి ఒక పెద్ద సమస్య వదిలిపోతోంది అని సంతోషిస్తుంటే, రెడ్డి కులస్తులు మాత్రం ‘ముద్రగడ పద్మనాభ రెడ్డి’ తమ రెడ్డికులాన్ని ఏం చేస్తారో అని భయపడిపోతున్నారు. కాపుల నాయకుడిని అని చెప్పుకుంటూ ముద్రగడ కాపులను ఎంత ఇబ్బంది పెట్టారో చరిత్రను పరిశీలించిన వారికి తెలుస్తుంది. ఏదో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఇప్పుడు కాపులు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఇప్పుడు చంద్రముఖిగా మారిన గంగ తరహాలో ‘రెడ్డి’గా మారిన ముద్రగడ తమ రెడ్డి కులాన్ని ఏం చేస్తారో అని రెడ్లు భయపడిపోతున్నారు.