పేర్ని నాని ఇంటిపై రాళ్ల దాడి...ప్రజాగ్రహమే కారణం
posted on Jun 5, 2024 @ 12:31PM
కర్మ సిద్ధాంతము అనేది ఇపుడు ఎపిలో అమలవుతోంది. హిందూ మతం, దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం, సిక్కు మతం,, జైన మతం. ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. వైఎస్ జగన్ ఐదేళ్ల రాక్షసపాలనలో ప్రజలు విసిగి వేసారి పోయారు. ఎపిలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కూటమి నేతలు, కార్యకర్తల మీద దాడులు చేసిన వైసీపీ గూండాలు బరితెగించే పనులే చేశారు . మచిలీ పట్నం జనసేన నేత కర్రి మహేష్ ఇంటి ముందు పార్క్ చేసిన కారును అర్ధ రాత్రి దాటిన తర్వాత పెట్రోల్ పోసి తగల బెట్టారు. వైసీపీ గూండాలు చేసిన భౌతికదాడులు, హింసాత్మక సంఘటనలను జగన్ ప్రభుత్వం నిలువరించలేకపోయింది. పోలీస్ స్టేషన్ లకు వెళ్లి ఫిర్యాదులు చేసినా ఎఫ్ ఐ ఆర్ కట్టే పోలీసు అధికారులు భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. ఈ అరాచకమే ప్రజల్లో జగన్ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమైంది. కౌంటింగ్ ఫలితాలు డిక్లేర్ కాకమునుపే వైఎస్ ఆర్ యూనివర్శిటీ బోర్డును తీసేసి ఎన్ టిఆర్ యూనివర్శిటీ పేరు రాసుకున్నారు.
జగన్ ప్రభుత్వ హాయంలో పెట్రేగిపోయిన మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. గుంపుగా వచ్చిన కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కుర్చీలు విసురుతూ బీభత్సం సృష్టించారు. అక్కడే పార్క్ చేసిన కార్లపైనా ప్రతాపం చూపారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దాడిని నిలువరించలేకపోయారు. దాడి భయంతో ఓ పోలీసు పారిపోవడం కనిపించింది.
ఇది టీడీపీ, జనసేన కార్యకర్తల పనేనని కొందరు ఆరోపించడాన్ని మచిలీపట్నం జనసేన నేత వాడ వీర ప్రతాప్ ఖండించారు. మచిలీపట్నంలో పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కృష్ణ మూర్తి చేసిన అకృత్యాలకు ప్రజల నుంచి ఒక రెవల్యూషన్ ప్రారంభమైంది ఇందులో భాగంగానే ఈ దాడి జరిగింది