'నేనే నాయక్'.. నిరుపించుకున్నరావత్
posted on Dec 24, 2021 @ 5:48PM
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం తీరుపై నేరుగా విమర్శలు చేసి సంచలనానికి తెర తీసిన రావత్ చివరాఖరుకు, ‘నేనే నాయక్’ అని నిరూపించుకున్నారు. శాసనసభ ఎన్నికల వేళ కాళ్ళు చేతులు కట్టేసి ఎన్నికల సముద్రం ఈద మంటున్నారని పార్టీ అధినాయకత్వం పై నేరుగా విమర్శలు చేసిన రావత్, పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఎన్నికల ప్రచార కమిటీకి తానే సారథ్యం వహించేలా అధిష్ఠానాన్ని ఒప్పించారు. ఈరోజు (శుక్రవారం) రాష్ట్ర నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లిన రావత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. పంజాబ్’లో నవజ్యోతి సింగ్ సిద్దూ అనుసరించిన్ ఫార్ములాను ఉపయోగించి, పార్టీని తమగుప్పిట్లోకి తెచ్చుకున్నారు.
అంతే కాదు, కలిసి పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందా’ మని, ప్రత్యర్ధి వర్గానికి పిలుపునినిస్తూనే, “నా నేతృత్వంలోనే ఉత్తరాఖండ్ ఎన్నికలు జరుగుతాయి” అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.అయితే, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తమ పేరును ప్రకటించాలని కోరుతున్న రావత్, తనలో అసంతృప్తి ఇంకా కొంత అలాగే ఉందని చెప్పడం ద్వారా అచెలంచెలుగా, అగ్రనాయకత్వం పై పోరాటం కొనసాగుతుందని చెప్పకనే చెప్పారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల గాంధీ, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రావత్ పేరును ప్రకటించేందుకు సుముఖంగా లేరని, అందుకే అయన రావత్ పేరును ఇంకా ప్రకటించలేదని అంటున్నారు.ఈ విషయంపై విలేకరులు ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవటంపై అధ్యక్షుడికి ప్రత్యేక అధికారం ఉందన్నారు.. ఎన్నికల అనంతరం శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిని ఎన్నుకోవాలనే ప్రక్రియకు కట్టుబడి ఉంటామన్నారు.
రావత్ తాజా వ్యాఖ్యలతో పార్టీ నాయకత్వంతో ఉన్న విభేదాలు సమసిపోయినట్లే కనిపిస్తున్నాయి. డిల్లీకి వెళ్లే ముందే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాతోనూ రావత్ ఫోన్లో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీతో ఆయనకు ఉన్న సమస్యలను పరిష్కరించే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, గతంలో, పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జిగా రావత్ తమను తప్పుదోవ పట్టించారనే, అభిప్రాయంతో ఉన్న రాహుల్, ప్రియాంక తాత్కాలికంగా పార్టీ పగ్గాలు రావత్’కు అప్పగించారని, అన్నీ కలిసొచ్చి ఉత్తరాఖండ్’లో పార్టీ విజయం సాదించి అధికారంలోకి వస్తే, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే, రావత్ పైచేయి సాధించారు.