Read more!

పచ్చి పాలు తాగితే ప్రమాదమా?

పచ్చిపాలు తాగితే చాలా లాభాలు సురక్షితం అనికొందరు.  కాదు కాదు పచ్చిపాలు ఆరోగ్యానికి హానికరం అని ఇంకొందరు అంటున్నారు మరి అందులో నిజం ఏది? అనితేలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. ఇక వివరాల లోకి వెళ్తే మనం ప్రతిరోజూ పాలు ఎదో రూపం లో వాడుతూ ఉంటాము.మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు పాలు లాభదాయకంగా ఉంటుంది. అని అందరూ అంగీకరిస్తారు.మరి మీరు తేల్చుకోవాల్సిన అంశం ఏమిటి అంటే పచ్చిపాలు లాభదాయకమని లేదాపేస్టూ రైజ్డ పాలు లాభమా అన్నది ప్రశ్న. మీరు రోజూ పాలు తాగుతారా ?అయితే ఇది చదవడం అత్యవసరం.పాలు మనం ప్రతిరోజూ ఎదోరూపం లో వాడతాము.అసలు పాలు లేకుండా రోజు గడవడం కష్టం.అంటే పాలు లేకుండా ఉండడం కొంచం కష్టం.మీ ఇమ్యునిటీ నిపెంచడం దగ్గరనుంచి ఎముకలు,పళ్ళు బలంగా ఉండేందుకు మెటాబాలిజం పెంచేందుకు పాలు దోహదం  చేస్తాయని అనడంలో సందేహం లేదు. అయితే మీరు పాలను సరైన పద్దతిలో తాగాకుంటే పాలలో ఉండే సంపూర్ణ పోషకాలు లేకుండా మీ శరీరానికి ఉపయోగ పడదు.

పచ్చిపాలు తాగ వచ్చా?

ఇందులో ఆశ్చర్య పోవాల్సింది ఏమిలేదు మనశరీరానికి పచ్చిపాల లో ఉన్న పోషక తాత్వాలను అందిస్తుంది.ఎందుకంటే గడ్డితిని ఆవులు లేదా గేదెల నుండే పాలు తీస్తారు.ఈ విధంగా పాలు ఎంజయిం ఆరోగ్యం ప్రోటీన్లతో సంపూర్ణంగా ఉంటుంది.ఆయితే కొన్నిరకాల కీటకాలు ,జీవాణువులను చంపాలంటే పాలను ఒకక్రమ పద్దతిలో సాగుతాయి.ఈ కారణంగా ఎలర్జీ తో పాటు గుండె సంబందిత రోగాలు రావచ్చు.

పాల వల్ల లాభాలు...

కొన్ని ఏళ్లుగా పాలు తాగడం వల్ల కలిగే లాభాలు చెపుతూనే ఉన్నాము.నష్టాలు గురించి తక్కువే చెప్పుకుంటాము పాలలో కాల్షియం,పోస్ఫరస్,విటమిన్ బి,పొటాషియం,విటమిన్ డి,వంటి పోషక తత్వాలు సంపూర్ణంగా ఉంటాయి.దీనితోపాటు ప్రోటీన్ అధికసంఖ్యలో లభిస్తుంది.మన ఎముకలను పటిష్టంగా ఉంచేందుకు పాలు దోహదం చేస్తాయి.కణాలు టిష్యులు రీజేనేవేషన్,లేదా మెదడు చురుకుగా పనిచేసేందుకు ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుంది.మరి మీరు సరైన పద్దతిలో పాలు తీసుకుంటున్నారా.?

పాలు తాగాలంటే సరైన పద్ధతి ఏమిటి?

పాలను వినియోగించాలంటే మిల్క్ షేక్,స్మూదీ,టీ,మిటాయి, ఎక్కడైనా ఏరూపంలో ఐనా వాడతారు.ప్రతివ్యక్తి పాలను వాడే సరైన పద్ధతి వేరు వేరుగా ఉంటుంది. కాని చాలామందికి పచ్చి పాలు 
తాగడం ఇష్ట పడతారు.ఇది ఏ మాత్రం కలుషితం లేనిదని పవిత్ర మైనవిగా భావిస్తారు. పచ్చిపాలను తాగడం మంచిదేనా? సురక్షితమా? కొన్ని ఏళ్ళుగా ఒక పరంపరగా పచ్చిపాలను తాగడం ఆరోగ్యానికి మంచిదని ధర్మంగా భావిస్తారు.వీటిలో ఏ రకమైన పదార్ధాలు తీయకుండా నేరుగా తాగడం కాలాను గుణంగా ఆలోచనలు పెరిగి మార్పులు వచ్చాయి. ఇప్పుడు పచ్చిపాలు తాగడం సురక్షితం కాదని నిర్ధారించారు.

పచ్చి పాలు తాగితే ఏమౌతుంది?

పచ్చి పాలు తాగడం వల్ల హానికలగ వచ్చు ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా లిస్టేరియా,ఈ కోలి,కాక్సిఎలా ,సాల్మనేల్ల,కేండి లో బెక్టర్,యార్సినియా,ఆరోగ్యం పంచెంద్రియాల పై సమస్యలు సృష్టించ వచ్చు. ఒక వేళ ఆయా ఆవులు గేదేలలో శరీరం లో ఏమైనా వైరస్ సంక్రమించి ఉంటె సమస్యలు వస్తాయి. గర్భవతులు పాలిచ్చే తల్లుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.