నన్ను ఇరికించకండి ప్రభో.. వర్మకి రాజమౌళి ట్వీట్
posted on Sep 9, 2015 @ 3:59PM
ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి పైన విమర్శలు చేస్తే కాని రాంగోపాల్ వర్మకి నిద్రపట్టదు. అందుకే ఎప్పుడూ ట్విట్టర్ ద్వారా తన పిచ్చిని అప్పుడప్పుడు బయటపెడుతుంటాడు. ఎప్పుడూ విమర్శిస్తే ఏం బావుటుంది అని అనుకున్నాడేమో తెలియదు కాని బాహుబలి విషయంలో ఎస్ఎస్ రాజమౌళిని మాత్రం పొగిడేశాడు. బాహుబలి సినిమా రిలీజైనప్పుడు కూడా రాంగోపాల్ వర్మ రాజమౌళిని.. హీరోలని ప్రశంసించాడు. కాని ఈసారి పొగిడిన పొగడ్తలకి రాజమౌళి పాపం భయపడినట్టున్నారు. అదేంటంటే ప్రస్తుతానికి ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ లో స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఉన్నాడనే విషయం తెలుసుకున్నానని ట్వీట్ చేశారు.
"I just now came to know that the SS in SS Rajamouli stands for Steven Spielberg''
అలా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ కు రాజమౌళి వెంటనే స్పందించి "జనంతో నన్ను తిట్టించడానికి కాకపోతే అవసరమా సార్ ఇపుడు ఇది" అంటూ ట్వీటారు. మొత్తానికి రాంగోపాల్ వర్మ తిట్టినా కాంట్రవర్సీలా... పొగిడినా కాంట్రవర్సీలా తయారైంది.