ఏపీ రాజధానికి సహకరించండి.. టాటా ఛైర్మన్ తో వెంకయ్య
posted on Sep 9, 2015 @ 3:27PM
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య ఏపీ రాజధాని నిర్మాణానికి.. అభివృద్ధికి సహకరించాలని.. అంతేకాదు ఒక్క రాజధాని నిర్మాణంలోనే కాక హైదరాబాద్ విశాఖ నగరాల్లో కూడా నిర్మాణ బాధ్యతలు స్వీకరించాలని సైరస్ మిస్త్రీని కోరినట్టు తెలుస్తోంది. ఇక్కడే కాదు దేశంలో ఇతర ప్రాంతాల అభివృద్ధికోసం.. వెంకయ్య చేపట్టిన స్మార్ట్ సిటీ పథకం.. స్వచ్ఛ భారత్, అందరికీ ఇళ్లు పథకాలపై కూడా సహకారం అందించాలని కోరారు. దీనికి సైరస్ మిస్త్రీ కూడా సానుకూలంగా స్పందించి అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు.
కాగా మోదీ స్వచ్ఛ భారత్ లో భాగంగా పిలుపు నిచ్చిన మేరకు టాటా సంస్ధ ముందుకొచ్చి విజయవాడలోని 264 గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.