Read more!

కేసీఆర్ శ‌ృంగారపురుషుడు: వర్మ ట్విట్

 

తన ‘ఐస్ క్రీం’ సినిమా రిలీజ్‌కి రెడీ అయింది కదా.. అందుకే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ రంగంలోకి దిగాడు. ఏదోరకంగా వార్తల్లోకి వచ్చే తన పథకంలో భాగంగా ట్విట్టర్‌లో ట్విట్లు చేయడం ప్రారంభించాడు. ఈసారి రామ్ గోపాల్ వర్మ తన ట్విట్లలో కేసీఆర్ని టార్గెట్ చేశాడు. ఆ ట్విట్లు ఎలా వున్నాయో చూడండి.

 

1. టీఆర్ఎస్ ఆఫీస్ అవతల కేసీఆర్ లో భగవంతుడి అవతారాన్ని చూసుకున్నామని చాలా మంది అమ్మాయిలు నాతో అన్నారు. రాముడు, కృష్ణుడు కన్నా కేసీఆరే శృంగార పురుషుడిగా కనపడుతారు.

 

2. అతిపెద్ద కేసీఆర్ విగ్రహాలు, హోర్డింగ్‌లతో హైదరాబాద్ పట్టణం సుందరంగా ఉంటుంది అని ఓ కాలేజీ అమ్మాయి నాతో అంది.

 

3. కేసీఆర్ ను మహిళలు ప్రేమించడం విషయం మీద నాకు ఆశ్చర్యం కలిగిస్తూ వుంటుంది. ఎక్కువ మంది మహిళలు అధికారాన్ని ప్రేమిస్తుంటారని.. అందుకే కేసీఆర్‌ని ప్రేమించి ఉంటారని అనుకుంటున్నా.

 

4. కేసీఆర్ అంటే తనకి చెప్పలేనంత ఇష్టమని.. హైదరాబాద్ సిటీలోనే అంత అందగాడు ఉండరని మరో అమ్మాయి నాతో అంది.

 

5. హైదరాబాద్‌లోని ఉద్యానవనం లాంటి అద్భుతమైన కేసీఆర్ ముఖాన్ని ఇప్పటివరకు నేను చూడలేదు. కేసీఆర్ ముఖాన్ని ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఎవరూ మరిచిపోరు. చివరికి గజనీ కూడా గుర్తుంచుకుంటాడు.