ఇటలీకి రాహుల్.. ఇండియాలో రచ్చ
posted on Dec 31, 2021 @ 8:04PM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడ? ఒకప్పుడు ఇదొక పెద్ద ప్రశ్న. ఒకసారి కాదు అంతకంటే ఎక్కువసార్లే ఆయన ఎవరికీ చెప్పపెట్టకుండా విదేశాలకు వెళ్ళిపోవడం... ఎక్కడి కెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనేది ఎవరకీ తెలియకపోవడం, పార్టీ నాయకులు మీడియా ముందు కొంచెం చాలా ఇబ్బంది పడడం, అందరికీ తెలిసిన విషయమే. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా రాహుల్ గాంధీ కనిపించని సందర్భాలు చాలానే ఉన్నాయి.ఇప్పుడు మళ్ళీ అలాంటి సందర్భమే వచ్చింది. అయితే, ఇప్పుడు గతంలోలా ఎవరికీ చెప్పాపెట్టకుండా గాయబ్ కాలేదు . అందరికీ చెప్పే ఇటలీ వెళ్ళారు. ఇటలీ ఎందుకు వెళ్లారు అనేది వేరే చెప్పనక్కర లేదు. సంక్రాంతికో ఉగాదికో మనం మన అమ్మమ్మ ఊరుకు పోతాం కదా, ఆలాగే, ఆయన న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం కావచ్చు, అమ్మమ్మ ఊరు (ఇటలీ) వెళ్ళారు.
నిజానికి ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. ప్రధాని మోడీ సంవత్సరంలో ఒక సారో రెండు సార్లో గుజరాత్ వెళ్లి అమ్మను చూస్తారు కదా .. ఇది కూడా అలాంటిదే. కానీ, ప్రస్తుత పరిస్థితి ఏంటి, దేశంలో ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో విదేశాలకు వెళ్లి, వచ్చే ప్రయాణికుల పట్ల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన ఇటలీ ఎలా వెళతారని, బీజేపీ, పాయింట్ రైజ్ చేసింది, ఇది రాహుల్ జీ వ్యక్తిగత పర్యటన, వ్యక్తిగత పర్యటనను రాద్ధాంతం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు రాహుల్ పర్యటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ ఆయన విదేశాలకు వెళ్లడం బాధ్యతారాహిత్యమంటూ బీజేపీ విమర్శించింది. ఇదే అదనుగా గతంలో రాహుల్ గాంధి విదేశీ పర్యటనల హిస్టరీ మొత్తం బయటకు తెస్సింది. గతంలో కేంద్ర మంత్రి అమిత్‌షా పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2015 నుంచి 2019 వరకు రాహుల్ గాంధీ 247 సార్లు విదేశాలకు వెళ్లారని తెలిపారు. కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ఆయన పర్యటనలు చేస్తున్నారని అమిత్‌షా విమర్శించారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు.
మరో వంక బీజేపీ తీరుపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటలీ వెళ్లారు. బీజీపే ఆ పార్టీ మద్దతుదారులు ఈ విషయాన్నిసోషల్ మీడియాలో రాద్దాంతం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, అంటూ ఏఐసీసీ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా అన్నారు. అదలా ఉంటే, రాహుల్ గాంధీ విదేశీ పర్యటన గురించి అంతగా రాద్ధాంతం చేస్తున్న బీజేపీ నాయకులు, కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నారా, అని కాంగ్రెస్ అనుకూల సోషల్ మీడియాలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడ్ పాల్గొన్న బహరీ బహిరణ సభలను ఫోటోలను జోడించి ... మరీ ట్రోల్ చేస్తున్నాయి. నిజమే ప్రధాని నరేంద్ర మోడీ నిన్న (గురువారం) ఉత్తఖండ్’లో భా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ రోజు అయోధ్యలో హోమ్ మంత్రి అంతకంటే పెద్ద బహిరంగ సభలో పాల్గొన్నారు. నిజానికి, నిన్న ఈరోజు అని కాదు, బీజేపీ నాయకులు కొవిడ్ నిబంధనలను గాలికి వదిలేసి భారీ బహిరంగ సభలు నిర్వహించని రోజు లేదు. సో.. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి నందుకు ఎవరి మీదనైనా చర్యలు తీసుకోవాలంటే ముందుగా ప్రధమ సేవకుడు (పీఎం) మీద ఆ తర్వాత హోమ్ మంత్రి అమిత్ షా మీద తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు ..సోషల్ మీడియా సూటిగా ప్రశ్నిస్తోంది.. నిజమే కదా ..