ఎమ్మెల్యే రికార్డింగ్ డ్యాన్స్.. సోము సంచలనం.. బార్లు ఓపెన్.. టాప్ న్యూస్@7PM
posted on Dec 31, 2021 @ 6:49PM
జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. 2022లోనైనా రాష్ట్ర ఆర్థిక స్థితి చక్కదిద్దే యాక్షన్ ప్లాన్ ఉందా అని ప్రశ్నించారు. ‘‘మీరు పట్టిన కుందేలుకు మూడు కాళ్లనే మొండితనమేనా?’’ అని యెద్దేవా చేశారు. ఫ్యాక్షనిస్ట్ చేతిలో అధికారం.. వేటగాడి చేతిలో బాణం ఒక్కటే అన్నారు. ప్రజాస్వామ్యానికే కాదు.. ప్రజలకు నిలువెల్లా గాయాలే అని యనమల వ్యాఖ్యాలు చేశారు
------
నెల్లూరు జిల్లాలో విపక్షాలు మీడియాపై చిందులువేసే ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి రికార్డు డ్యాన్సులకు సాక్షిగా నిలిచారు. పైగా వారిని వారించే ప్రయత్నం కూడా చేయలేదు. రాజుపాలెంలోని ప్రసన్నకుమార్ ముఖ్య అనుచరుడి గెస్టు హౌస్‌లో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించారు. ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. యువతులతో రికార్డింగ్ డ్యాన్సులు వేయించారు.
---------
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘నన్ను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో నాకు తెలుసు. నాపై ట్వీట్ చేసిన కేటీఆర్ తండ్రి తెల్లవారుజాము దాకా ఏం చేస్తారు?.. నేను సారాయి వీర్రాజును కాదు.. బియ్యం వీర్రాజును.. సిమెంట్ వీర్రాజును... కోడిగుడ్ల వీర్రాజును’ అని చెప్పారు. పేదవాడిని దృష్టిలో పెట్టుకునే లిక్కర్‌పై మాట్లాడానని వివరించారు.
--------
కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను వరి వేయవద్దని.. తాను మాత్రం ఫామ్‌హౌస్‌లో వేశారని మండిపడ్డారు. కేసీఆర్ వరిసాగుపై ప్రజలకు చెబుతామనే నిర్బంధించారన్నారు. జీవో 317తో ఇష్టానుసారంగా ఉపాధ్యాయులను బదిలీ చేశారని తెలిపారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారని... ఆ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తే నిర్బంధిస్తారా? అని ప్రశ్నించారు
------
బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. పిచ్చివాడి చేతికి ఏపీ బీజేపీని అప్పగించారని, ఆయన ఇంటిపేరు సారాయిగా మారిపోయిందన్నారు. బిచ్చగత్తే కంగనా రనౌత్ దారిలో బీజేపీ నడుస్తోందని దుయ్యబట్టారు. విప్పేసి ఆడే కంగనాకు పద్మశ్రీ.. రైతులకు సాయపడే సోనుసూద్‌పై ఐటీ దాడులా అని నారాయణ ప్రశ్నించారు. నోట్ల రద్దు తర్వాత బీజేపీ లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు.
------
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ చిత్తూరు జిల్లా పోలీసులను ఆశ్రయించారు.జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.వైసీపీలో ఉంటూ టీడీపీతో జతకలిసిన వారిని క్షమించేది లేదని రోజా స్పష్టం చేశారు. ఫ్లెక్సీల్లో మంత్రి పెద్దిరెడ్డి, రాష్ట్ర డీజీపీ ఫొటోలు వేసుకుని అధికారులను కూడా బెదిరిస్తున్నారని రోజా మండిపడ్డారు.
-----
వైన్ షాపులు, బార్ల సమయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. రెగ్యులర్ సమయం కంటే మరో గంటసేపు సమయాన్ని పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అర్ధరాత్రి వరకు ఈవెంట్స్ తో పాటు, పర్యాటక లైసెన్సులు పొందిన హోటళ్లలో మద్యం అమ్మకాలకు అనుమతిని ఇచ్చింది. ప్రీమియం బ్రాండ్ల విక్రయాలను ప్రారంభించింది.
--
ఏపీ హైకోర్టులో ఆనందయ్య పిటిషన్ దాఖలు చేశారు. కరోనా మందు తీసుకొనేందుకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆనందయ్య పిటిషన్‌లో పేర్కొన్నారు. డివిజన్ బెంచ్‌లో విచారణకు సింగిల్ జడ్జి సూచించారు. గతంలో ఆనందయ్య మందుపై ధర్మాసనంలో విచారణ జరిగిన విషయాన్ని న్యాయవాదులు గుర్తుచేశారు. దీనితో ప్రధాన న్యాయమూర్తి దగ్గరకి పంపాలని సింగిల్ జడ్జి పేర్కొన్నారు.
--------
గత ఏడాది తెలంగాణలో క్రైమ్ రేటు 4.6 శాతంపెరిగింది. నేరాల్లో నిందితులకు శిక్షపడిన కేసులు 50.3 శాతమని చెప్పారు డీజీపీ మహేందర్ రెడ్డి. 80 కేసుల్లో 126 మందికి జీవిత ఖైదు పడిందని తెలిపారు మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉండాలన్న ప్రభుత్వ సూచనలను సమర్థంగా అమలు చేశామన్నారు డీజీపీ. ఇప్పటిదాకా 98 మంది నక్సలైట్లను అరెస్ట్ చేశామని, మరో 133 మంది లొంగిపోయారని పేర్కొన్నారు.
----
టాలీవుడ్ యువ హీరో విష్వక్ సేన్ కరోనా బారినపడ్డాడు. . కరోనా నిర్ధారణ పరీక్షల్లో తనకు పాజిటివ్ గా తేలిందని సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశాడు. తన వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ ఐసోలేషన్ లో ఉన్నానని విష్వక్ సేన్ వెల్లడించాడు. వ్యాక్సినేషన్ తర్వాత కూడా కార్చిచ్చులాగా కరోనా వైరస్ వ్యాపిస్తుండడం దురదృష్టకరమన్నారు.
---------
హాలీవుడ్ కండలవీరుడు, టెర్మినేటర్ అర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ కీలక ప్రకటన చేశారు. తన భార్య శ్రివర్ కు విడాకులిస్తున్నట్టు ప్రకటించారు. వీరిద్దరూ 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. దాదాపు పదేళ్ల క్రితమే విడాకుల కోసం వీరు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఎవరికి వారు విడివిడిగానే బతుకుతున్నారు. వీరికి ఉన్న 400 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విభజించి సెటిల్ చేయడానికి కోర్టుకు ఇంత సమయం పట్టింది.