ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీ నిరసన.. లక్నోలో హై టెన్షన్
posted on Oct 6, 2021 @ 3:29PM
ఉత్తర్ ప్రదేశ్ లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. లఖింపూర్ లో రైతుల ఆందోళన హింసాత్మకం కావడంతో మొదలైన రగడ రోజురోజుకు ఉధృమవుతోంది. విపక్షాలు పెద్ద ఎత్తున నిరనసలు తెలుపుతుండటంతో రాష్ట్రమంతా టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. లఖింపూర్ వెళుతున్న ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆమె వాగ్వాదానికి దిగడం రచ్చరచ్చైంది. తాజాగా లఖింపూర్‌కి వెళ్లేందుకు లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లోనే ఆయన బైఠాయించి నిరసనకు దిగారు.
రాహుల్ గాంధీతో పాటు పంజాబ్ సీఎం చన్నీ, ఛత్తీస్‌గఢ్ సీఎం బూపేష్ భాఘేల్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా విమానాశ్రయంలో బైఠాయించారు. సొంత వాహనంలో కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో వెళ్లాలని పోలీసులు షరతు పెట్టారు. దీనికి రాహుల్ గాంధీ నిరాకరించారు. యోగి ప్రభుత్వం ఏదో ప్లాన్ చేసిందని, తాను తన సొంత వాహనంలో తప్ప మరే ఇతర వాహనంలో వెళ్లనని రాహుల్ తేల్చి చెప్పారు. అయినప్పటికీ పోలీసులు వినకపోవడంతో లఖ్‌నవూ ఎయిర్‌పోర్ట్‌లోనే రాహుల్ నిరసనకు దిగారు. తను కారులోనే లఖింపూర్‌కు వెళ్లాలని అనుకుంటున్నానని చెప్పారు రాహుల్ గాంధీ. కానీ పోలీసులు వేరే వాహనంలో వెళ్లాలని అడ్డుకుంటున్నారని తెలిపారు. పోలీసులు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయడం వెనుక ఏదో ప్లాన్ ఉందనే అనుమానం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. సొంత వాహనంలో కాకుండా వేరే వాహనంలో వెళ్లబోనని చెప్పారు.
లఖింపూర్ ఖేరిలో పర్యటించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందు అనుమతి ఇవ్వలేదు. ఎట్టకేలకు బుధవారంనాడు అనుమతి ఇచ్చింది. ప్రియాంక గాంధీని లఖింపూర్ చేరకుండా రెండ్రోజుల క్రితమే పోలీసులు అడ్డుకుని గెస్ట్ హౌస్‌కు తరలించగా, రాహుల్ గాంధీ బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని తీసుకుని న్యూఢిల్లీ నుంచి లక్నోకు విమానంలో బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాహుల్, ప్రియాంక, మరో ముగ్గురిని లఖింపూర్‌లో పర్యటించేందుకు ప్రభుత్వం అనుమతించినట్టు యూపీ హోం శాఖ ప్రకటన విడుదల చేసింది.