విభజన హామీల పూర్తికి రాహుల్ హామీ
posted on Oct 19, 2022 @ 2:46PM
ఆంధ్రప్రదేశ్ విభజన హామీల విషయంలో ఇప్పటికే ప్రజలు నీళ్లు వదిలేశారు. జగన్ సర్కార్‌తో ఏమీ అవదని తేలిపోయింది. ఇపుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన పాదయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి మళ్ళీ ఆశలు రేపుతున్నారు. విభజన హామీలన్నీ తమ ప్రభుత్వంతోనే నెరవేరుతాయని, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని ఆయన ప్రజలను కోరారు.
భారత్ జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశించింది. దీనిలో భాగంగా బుధవారం రాహుల్ గాంధీ కర్నూలులో పర్య టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయలో ఇచ్చిన కొన్ని హామీలు తాము అధికారంలోకి రాగానే తీరుస్తామన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజ ధాని విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుని పూర్తిచేస్తామని కీలక ప్రకటన చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం ప్రచారం చేస్తున్న మూడు రాజధానుల ఆలోచన సరయినది కాదన్నారు. రాష్ట్ర విభ జన హామీల్లో పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉందన్నారు. విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలన్నా రు. పోలవరం పూర్తి చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
అమరావతి రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు రాహుల్ ప్రకటిం చారు. భారత్ జోడో యాత్ర ద్వారా చాలా విషయాలు నేర్చుకు న్నానన్నారు. దేశంలో కొన్ని శక్తులు ద్వేషం, హింసను పెంచు తున్నాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయన్నారు. బీజేపీ దేశాన్ని విభజి స్తోందని.. ద్వేషాన్ని సృష్టిస్తోందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు.. ఉల్లి రైతులు ధర లేక ఇబ్బం దుల్లో వున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లాలో భారత్ జోడో యాత్ర చేస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలవరం నిర్వాసితు లు, అమరావతి రైతులు కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా చూడాలని రాహుల్ కి అమరావతి జేఏసీ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఏపీకి అమరావతే ఏకైక రాజధానిగా వుండాలని రాహుల్ గాంధీ అన్నారు. అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు రాహుల్. రైతు లు రాజధాని కోసం భూములిస్తే.. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు పెడతామని అంటోంద న్నారు రాహు ల్. ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి వున్నామని.. అధికారంలోకి వస్తే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతుల సమస్యలు చూస్తుంటే బాధగా వుందని రాహుల్ అన్నారు.