మోదీజీ మీ జాబితాలో రేపిస్టులనూ చేర్చండి...ఓవైసీ చురక
posted on Oct 19, 2022 @ 1:19PM
మంచివారు ఎవరన్నది చర్చగా మారిపోతోంది. జైలు జీవితం గడుపుతున్నంత మాత్రాన వారంతా చాలా మంచివారుగా, సత్ప్రవర్తనతో తమ జీవితాన్ని కొనసాగిస్తారని బీజేపీ అభిప్రాయం కావచ్చునేమోగాని విప క్షాలు అలా భావించడం లేదు. కేవలం తమ అధికారం చలాయించడానికి అడ్డుగోడలను తొలగించు కోవ డానికే ఇలాంటి ప్రచారాలు చేయడం తప్ప వాస్తవానికి సమాజంలో జరుగుతున్నది విరుద్ధమన్నది విప క్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా బిల్కిస్‌బానో కేసులో ఇటీవల పదకండు మంది నిందితులు ఎంతో మారిపోయారంటూ విడుదల చేయడం పై పెద్ద దుమారమే లేచింది. తాజాగా ఏఐఎంఐఎం అధి నేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడుతున్నారు.
బిల్కిస్ బానో కేసుకి సంబంధించి 11మంది నిందితులను విడుదల చేశారు. అయితే ఇది కేంద్ర హోం మంత్రి ఆదేశం మేరకే జరిగిం దన్న విమర్శలు ఇంకా ఉన్నాయి. బుధవారంనాడు గుజరాత్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో 2022 ఆరం భోత్సవం సంద ర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, దేశం పావురాళ్లను ఎగరే యడం నుంచి పులులను విడుదల చేసే స్థితికి వచ్చిందని అన్నారు. దీనికి ఏఐఎంఐఎం ఛీఫ్ అసదు ద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు.
ప్రధాని ప్రకటనలో చీటాలతో పాటు రేపిస్టులను కూడా ఆ జాబితాలో చేర్చాలని అసదుద్దీన్ విమర్శనా స్త్రం సంధించారు. ఇపుడు ఇది తీవ్ర ప్రకంపనలకు దారితీస్తోంది. బీజేపీ ప్రభుత్వం కేవలం చిరుతల నే కాదు అత్యాచారాలను చేసేవారికి కూడా స్వేచ్ఛనిస్తోందని ఓవైసీ ఎద్దేవా చేశారు. బిల్కిస్ బానో కేసులో 11 మందికి స్వేచ్ఛనీయడంలో అర్ధమేమంటని ప్రశ్నించారు. వారిని విడుదల చేయడం సీబీఐ కూడా వ్యతిరేకించినప్పటికీ వారిని విడుదల చేశారని ఓవైసీ మండిపడుతున్నారు. వారి ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చిందని, చాలా మంచివారిగా మారిపోయారనీ, పైగా వారి జైలు శిక్ష సమయం పూర్తిగా అను భవించారంటూ 11మందినీ విడుదల చేసినట్టు ప్రకటించారని గుజరాత్ ప్రభుత్వం పేర్కొన్నది. వారిలో ఒకరయిన మితేష్ చిమన్‌లాల్ భట్ పెరోల్ సమయంలో 2020ల జూన్‌లో ఒక మహిళపై అత్యా చారం చేశాడని తెలిసింది.
అసలు మంచిప్రవర్తన, మంచిగా మారాడన్నదానికి అర్ధమేమిటని తృణమూల్ కాంగ్రెస్ ఎం.పీ మహువా మైత్ర ప్రశ్నించారు. అచ్చేదిన్, అచ్చేలోగ్, బేటీకో బచావో అంటూ బీజేపీ, మోదీ సర్కార్ విజయాలకు ప్రచారం చేసుకుంటున్నపుడు ఈ విధమైన ప్రవర్తన కూడా మీకు ఎంతో మంచి ప్రవర్తనే అవుతుందా అని ఎంపీ ప్రశ్నించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే సంస్కారవంతులుగా మారిన రేపిస్టులకు స్వేచ్ఛా జీవితం ప్రసాదిస్తామని బీజేపీ తన మానిఫెస్టోలోనే పేర్కొంటుందేమో అని ఆమె ఎద్దేవా చేశారు.