జగన్ మీద విమర్శనాస్త్రాలు!

 

 

 

వైసీపీ అధ్యక్షుడు జగన్ పచ్చి విభజనవాది అని విమర్శిస్తూ ఆ పార్టీకి గుడ్ బై కొట్టి బయటకి వచ్చిన రఘురామకృష్ణంరాజు బీజేపీ తీర్థం పుచ్చుకుని నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన వైసీపీలో నుంచి బయటకి వచ్చిన క్షణం నుంచి జగన్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూనే వున్నారు. ఆ విమర్శనాస్త్రాలలో కొన్నిటిని ఒక్కసారి పరిశీలిద్దాం. ఆత్మగౌరవం చంపులోలేక పార్టీలోంచి బయటికొచ్చా. పార్టీలోంచి బయటకి వచ్చేవాళ్ళు ఇంకా బోలెడంతమంది వున్నారు. త్వరలో జగన్ పార్టీ కుప్పకూలటం ఖాయం.

 

1. కొత్తగా పెళ్ళయిన అమ్మాయి పాలగ్లాసుతో శోభనం గదిలోకి అడుగు పెడితే మొగుడు మగాడు కాదని తెలిస్తే పరిస్థితి ఎలా వుంటుందో జగన్ విభజనవాది అని తెలిశాక నా పరిస్థితి కూడా అలాగే తయారైంది.

2. జగన్ జనాల్లో రామాచారిలా వుంటాడు. పార్టీలోని వాళ్ళ దగ్గర మాత్రం అపరిచితుడిలా జుట్టు విదిలిస్తాడు.

3. మొదట్లో జగన్ నన్ను ‘మీరు’ అని పిలిచేవాడు. నేను జగన్ని ‘నువ్వు’ అనేవాడిని. ఆ తర్వాత పరిస్థితి రివర్సయిపోయింది.

4. క్షవరం అయితేగానీ వివరం తెలియదన్నట్టు జగన్ పార్టీలోకి వెళ్ళి క్షవరం చేయించుకున్న తర్వాతే నాకు జగన్ విషయం పూర్తిగా తెలిసింది. రాష్ట్ర ప్రజలకు కూడా క్షవరం కాకుండా వుండాలనే జగన్ గురించి అసలు విషయాలు బయటపెడుతున్నా.

5. నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలన్న సంస్కారం లేని వ్యక్తి జగన్.

6. పౌరాణిక సినిమా చూడాలని వెళ్తే థియేటర్లో షకీలా సినిమా చూపిస్తే ఆ ప్రేక్షకుడి పరిస్థితి ఎలా వుంటుందో, జగన్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి కూడా అలాగే మారింది.


 

Teluguone gnews banner