Read more!

పులివెందుల కాల్పుల ఘటన.. ఒకరి మృతి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందులలోనే నడి రోడ్డుపై కాల్పుల జరిపి హత్యలు జరుగుతున్నాయంటేనే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దివ్యంగా ఉందో అవగత మౌతుంది. పైగా వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొన్న భరత్ యాదవే ఈ కాల్పులకు పాల్పడ్డాడంటే అరాచకం ఏ స్థాయిలో రాజ్యమేలుతోందా అర్ధం అవుతుంది.

  వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు బంధువు, ఆ కేసులో   భరత్ యాదవ్ ను కూడా సీబీఐ విచారించింది. కాగా డబ్బు విషయంలో దిలీప్ అనే వ్యక్తితో గొడవపడిన భరత్ నడిరోడ్డుపై  తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దిలీప్ అనే వ్యక్తి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మరో వ్యక్తి బాషా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.  కాగా కాల్పులకు తెగబడ్డ భరత్ ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు. 

 ఇలా ఉండగా.. భరత్ కుమార్ యాదవ్  గతంలో సీబీఐ పై  ఆరోపణలు చేశారు. సునీత భర్త రాజశేఖర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహానీ పలు సందర్భాలలో పేర్కొన్నాడు. అలాగే వివేకా హత్య కేసులో  అప్రూవర్‌గా మారిన దస్తగిరి   భరత్ యాదవ్ తనను బెదరిస్తున్నాడంటూ పోలీసులకు  ఫిర్యాదు కూడా చేశారు.  ఇప్పుడు జరిపిన కాల్పులకు కూడా కూడా వివేకా హత్య కేసుకు సంబంధించిన   అర్థిక వ్యవహారాలలో  వచ్చిన విభేదాలే అన్న అనుమానాలు వ్యక్తమౌతు్నాయి.