కావూరి, విహెచ్‌కు ప్రమోషన్?
posted on Oct 29, 2012 @ 4:12PM
కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసం తృప్తితో ఉన్న ఎంపీ కావూరి సాంబశివరావు, వి.హనుమంత రావుకు ఏఐసిసిలో కీలక స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం నుంచి సంకేతాలు వచ్చినట్లు సమాచారం. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిం చడం ద్వారా వారిలో నెలకొన్న అసం తృప్తి కి చెక్‌పెట్టాలని అధిష్ఠానం ఆలోచనగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రకంగా వారి సీనియా రిటీకి తగిన గౌరవం కల్పించినట్లవుతుందని పార్టీ అధిష్ఠానం ఆలోచనగా కనిపిస్తోంది. రెండేళ్లలోపు కేంద్ర, రాష్ట్రాలలో సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశమున్నందున పార్టీ పదవులే కీలకమవుతాయన్న భావనను కలిగించి ఈ ఎంపీల్లో ఉన్న అసంతృప్తిని పారద్రోలాలి అని నాయకత్వం భావిస్తోంది. త్వరలో ఏఐసిసిలో ప్రక్షాళన చేయాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భావిస్తున్నట్లు సమాచారం. రేండేళ్లలోపు లోక్‌సభకు సాధారణ ఎన్ని కలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని విజయపథంలో నడిపించేలా ఏఐసిసి కొత్త టీంను ఏర్పాటుచేసుకోవాలని సోనియా ఆలోచనగా కనిపిస్తు న్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎంపీలు కావూరి సాంబశివరావు, వి.హనుమం తరావుకు ఏఐసిసి స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కావూరికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవి దక్కే అవకాశముందని పార్టీ ముఖ్యనేతలు కొందరు పేర్కొంటున్నారు.