ప్రిద్వీ షా భారత్ క్రికెట్ కి మరో సచిన్ అవుతాడా
posted on Nov 21, 2013 @ 11:28AM
‘ప్రిద్వీషా(14) బహుశః ఈ పేరు ఇంతవరకు ఎవరూ విని ఉండకపోవచ్చును. ముంబైలోని రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ అనే పాటశాలలో చదువుతున్నఈ బుడతడు మొన్నమంగళ బుధవారాలలోజరిగిన ఇంటర్ స్కూల్ క్రికెట్ పోటీలలో ప్రత్యర్ధి జట్టు సెయింట్ ఫ్రాన్సిస్ డీ’ అస్సిసీ స్కూలు జట్టుపై ఏకంగా 546 పరుగులు సాధించి దేశంలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
తన స్కూల్ టీంకి కెప్టెన్ కూడా అయిన ప్రిద్వీ షా మొదటి రోజు ఆటలో 166 బాల్స్ కి 257 పరుగులు తీయగా మరునాడు జరిగిన మ్యాచులో ఏకంగా 289 పరుగులు తీసి ఒక సరికొత్త రికార్డ్ సృష్టించి ప్రతిష్టాత్మకమయిన హరీస్ షీల్డ్ తన టీముకి సాధించిపెట్టాడు. రెండు రోజుల మ్యాచులో ప్రిద్వీషా 85 బౌండరీలు, ఐదు సిక్సర్లు తీసి తన సత్తా చాటుకొన్నాడు.
ఇదివరకు అంటే 1933-34లో ముంబైలో సి.ఐ.రైల్వే మరియు సెయింట్ జేవియర్ కాలేజి మధ్య జరిగిన మ్యాచులో దాదాబాయి హవేవాల చేసిన 515 పరుగులు అత్యధిక స్కోరుగా రికార్డు నెలకొని ఉంది. దానిని సచిన్ టెండూల్కర్ ఇదే హారిస్ షీల్డ్ కోసం జరిగిన పోటీలలో వినోద్ కాంబ్లీ తో కలిసి 664 పరుగులు తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ తరువాత నుండే అతను జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.
మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత సచిన్ టెండూల్కర్ కి సరిసమానమయిన రికార్డుని ప్రిద్వీ షా చేయడం చూస్తే భారత్ క్రికెట్ కు మరో సచిన్ దొరికాడనే నమ్మకం కలుగుతోంది. వీలయినన్ని ఎక్కువ పరుగులు తీయడమే నా ఏకైక లక్ష్యంగా బ్యాటింగ్ చేసి మా టీమ్ ని గెలిపించుకొన్నదుకు నాకు చాలా సంతోషంగా ఉందని ప్రిద్వీ షా మీడియాతో చెప్పాడు.