ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది
posted on Dec 30, 2022 @ 10:35PM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి విదితమే. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హకీంపేట వైమానిక స్థావరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు. రాష్ట్రపతికి మంత్రులు, అధికారులు వీడ్కోలు పలికారు.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 26వ తేదీన హైదరాబాద్ కు వచ్చిన సంగతి విదితమే. నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి ఇక్కడ విడిది చేశారు. ఆ నాలుగు రోజులూ ఆమె బిజీగా గడిపారు. డిసెంబర్ 27న నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థను విజిట్ చేశారు. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమయ్యారు. అలాగే ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ 28న భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. అక్కడ ప్రసాద్ పథకాన్ని ప్రారంభించారు.
అలాగే వరంగల్ లోని రామప్ప ఆలయాన్ని దర్శించారు. గురువారం (డిసెంబర్ 27) నారాయణమ్మ కాలేజ్ ను విజిట్ చేశారు. ఆ తర్వాత ముచ్చింతల్ లోని రామానుజాచార్య విగ్రహాన్ని సందర్శించారు. శనివారం( డిసెంబర్ 29) ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు . మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ముర్ము.. 3గంటల 40 నిమిషాలకు హకీంపేట నుంచి ఢిల్లీ పయనమయ్యారు.