ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూడకుండా...........
posted on Oct 19, 2012 @ 4:08PM
అవ్వడానికి పల్లెటూరి వారే అయినా విజ్జత, వివేకం చూపారు ఈ గ్రామస్తులు. ప్రకాశం జిల్లా అక్కచెరువుపాలెం కు చెందిన ఈ గ్రామస్తులు ఎడతెగని కరెంటు కోతలతో సతమత మయ్యారు. దాంతో పరిష్కారం కోసం పరిశ్రమించి అతి తేలికలో సమస్యను దూరం చేసుకున్నారు. పగలంతా పొలాల్లో పని చేసుకొనే వీరు సాయంత్రం విశ్రాంతి తీసుకునే సమయంలో కరెంటులేక బాధపడేవారు. అయితే వీరంతా కలసి ఇప్పుడు గ్రామంలోని అన్ని ఇళ్లకు సోలార్ కరెంటును ఉత్పత్తి చేసే ప్యానల్స్ ను అమర్చుకున్నరు. దీనికి గానూ వారు ప్రతి ఇంటికీ 3 వేల రూపాయలు ఖర్చుపెట్టారు. బ్యాంకులు మరో 27 వేలు అప్పుగా ఇచ్చాయి. దీనివల్ల 4 బల్బులు, రెండు ఫ్యాన్లు ప్రతి ఇంటిలోనూ పని చేస్తున్నాయి. ఇప్పుడు గ్రామం అంతా వెలుగులుతో విలసిల్లుతుంది. కరెంటు వెలుగులో భోజనం చేస్తున్నామని, ఫ్యాన్లు వేసుకొని హాయిగా నిద్రపోతున్నామని ఇది తెల్లవారే లేచి పొలంపనులు, పశువుల పనులు చేసుకుంటానికి బాగా ఉపయోగంగా వుంటుందని ఆ గ్రామస్తులు చెబుతున్నారు.