‘తెలుగువన్’ చెప్పిందే జరిగింది: ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్!
posted on May 31, 2024 @ 10:53AM
సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుకు చివరి రోజు పోస్టింగ్ ఇస్తారని, ఒక్కరోజు మాత్రమే పదవీ బాధ్యతల్లో వుండేలా చేస్తారని ‘తెలుగువన్’ ముందే చెప్పింది. తెలుగువన్ చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వర రావు మీద వున్న సస్పెన్షన్‌ను ఎత్తివేయనుంది. ఐదేళ్ల క్రితం జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏవీ వెంకటేశ్వరరావు మీద కక్షగట్టింది. ఆయన్ని సస్పెండ్ చేసింది. దాంతో ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించారు. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ‘క్యాట్’ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. క్యాట్ ఉత్తర్వులను జగన్ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఆ ఆర్డర్స్.పై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం జగన్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబీవీపై ఉన్న సస్పెన్షన్‌ని ఎత్తివేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్ ఇవ్వకపోతే అది సీఎస్‌కి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అవకాశం వుంది కాబ్టి. ఆయనపై వున్న సస్పెన్షన్‌ని ఎత్తివేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్ల నుంచి ఏబీవీ సస్పెన్షన్‌లో ఉన్నారు. శుక్రవారం నాడు ఏబీవీ చివరి వర్కింగ్ డే.. రిటైర్మెంట్ డే రోజున ఆయన విధుల్లోకి రానున్నారు. ఆ వెంటనే పదవీ విరమణ చేస్తారు. మొత్తానికి ఇలా జగన్ సర్కార్ ఏవీ వెంకటేశ్వర రావు చివరి వర్కింగ్ డే రోజున పోస్టింగ్ ఇస్తూ తన పైశాచిక ఆనందాన్ని ప్రకటించుకుంది. ప్రింటింగ్ మరియు స్టేషనరీ డిజీ గా ఏబివి కి పోస్టింగ్ ఇచ్చారు.